ఖిలావరంగల్: వరంగల్ జిల్లాలో మంగళవారం రాత్రి సాధారణ వర్షం కురిసింది. సగటున 18.3 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా సంగెం మండలంలో 58.4 మిల్లీ మీటర్లు, చెన్నారావుపేటలో 31.2 మిల్లీమీటర్లు, ఖిలా వరంగల్ లో 27.8 మిల్లీమీటర్లు, నర్సంపేటలో 27 మిల్లీమీటర్లు, వరంగల్లో 22 మిల్లీమీటర్ల సాధారణ వర్షాపాతం కురిసినట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
గీసుకొండ, నల్లబెల్లి, దుగ్గొండి, నెక్కొండ మండలాల్లో తేలికపాటి జల్లులు పడగా వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉంది కాబట్టి రైతులు చెట్ల కింద ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.