SL vs ENG | తిప్పేస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్లు.. చూస్తుండగానే 6 వికెట్లు కోల్పోయిన శ్రీలంక..!
SL vs ENG : సొంతగడ్డపై చెలరేగాలనుకున్న శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్ అస్త్రంతో పడగొడుతోంది. డేంజరస్ ఓపెనర్ పథుమ్ నిశాంక(9)ను ఔట్ చేసి జోఫ్రా ఆర్చర్(2-20) తొలి బ్రేకివ్వగా.. విల్ జాక్స్(3-22)తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు.
SL vs ENG : సొంతగడ్డపై చెలరేగాలనుకున్న శ్రీలంకను ఇంగ్లండ్ స్పిన్ అస్త్రంతో పడగొడుతోంది. డేంజరస్ ఓపెనర్ పథుమ్ నిశాంక(9)ను ఔట్ చేసి జోఫ్రా ఆర్చర్(2-20) తొలి బ్రేకివ్వగా.. విల్ జాక్స్(3-22)తన స్పిన్ మ్యాజిక్ చూపించాడు. రిటర్న్ క్యాచ్‌తో కుశాల్ మెండిస్(4)ను వెనక్కి పంపిన అతడు.. పవన్ రత్ననాయకే(0), దునిత్ వెల్లలాగే(10)లను వెనక్కి పంపి ఆతిథ్య జట్టును కష్టాల్లోకి నెట్టాడు. పవర్ ప్లే చివరి ఓవర్లో రెండు ఫోర్లు బాదిన వెల్లలాగే.. మిడాఫ్‌లో షాట్‌కు యత్నించి బ్రూక్ చేతికి చిక్కాడు. దాంతో… 34కే లంక ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్‌ను స్పిన్ వ్యూహంతో నిలువరించిన శ్రీలంక.. చేధనలో అదే వ్యూహాంలో చిక్కుకుంది. ఆస్ట్రేలియాపై సెంచరీతో మెరిసిన పథుమ్ నిశాంక(9) రెండు ఫోర్లతో దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా ఆర్చర్ అతడిని బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత నా వంతు అన్నట్టు విల్ జాక్స్(3-22) విజృంభించాడు. సులువైన రిటర్న్ క్యాచ్‌తో కుశాల్ మెండిస్(4)ను పెవిలియన్ పంపిన అతడు.. ఫామ్‌లో ఉన్న పవన్ రత్ననాయకే(0)ను డగౌట్ చేర్చాడు.
Three wickets for Will Jacks, two for Jofra Archer – Sri Lanka end the powerplay five down 😬
Ball-by-ball: https://t.co/MHISTAndyn pic.twitter.com/SsEy4ftd82
— ESPNcricinfo (@ESPNcricinfo) February 22, 2026
జోఫ్రా ఆర్చర్ ఓవర్లో కమిల్ మిశారా(6) ఔటవ్వగా.. శ్రీలంక నాలుగో వికెట్ పడింది. ఒత్తిడిలోనూ రెండు ఫోర్లతో దూకుడు కనబరిచిన దునిత్ వెల్లలాగే(10) టైమింగ్ కుదరక హ్యారీ బ్రూక్ చేతికి చిక్కాడు. కెప్టెన్ దసున్ శనక(9 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకోవాలనుకున్న కమిందు మెండిస్(13) 9వ ఓవర్లో సిక్సర్ బాదాడు. కానీ, బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి లంక కష్టాలను మరింత పెంచాడు. ప్రస్తుతం శనకకు తోడుగా హేమంత క్రీజులో ఉన్నాడు. 9 ఓవర్లకు స్కోర్.. 53-6.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

