Sam Pitroda | ‘భారత నైపుణ్యాలు బయటి దేశాల సేవకే’.. శాంపిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
Sam Pitroda | భారత పౌరుల నైపుణ్యాలు (Indians skills) బయటి దేశాలకు సేవలు చేసేందుకే దోహదపడుతున్నాయని, దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉన్నా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system) లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓవర్సీస్ ఛైర్మన్ శామ్‌పిట్రోడా (Sam Pitroda) విమర్శించారు.
Sam Pitroda : భారత పౌరుల నైపుణ్యాలు (Indians skills) బయటి దేశాలకు సేవలు చేసేందుకే దోహదపడుతున్నాయని, దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉన్నా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system) లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓవర్సీస్ ఛైర్మన్ శామ్‌పిట్రోడా (Sam Pitroda) విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
‘భారత యువతలో ఎంతో ప్రతిభ ఉంది. వారి నైపుణ్యాలను వినియోగించడంలో భారత్ విఫలమైంది. మన యువతను ఇతర దేశాలు విరివిగా వాడుకుంటున్నాయి. ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, న్యాయశాస్త్రం, పరిశ్రమలు.. ఇలా ఎన్నో రంగాల ఆవిష్కరణల్లో మన యువతే ప్రధానపాత్ర పోషిస్తోంది. సుమారు 150 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లేదు. మన ప్రతిభతో కనీసం ఫోన్‌కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్‌ను తయారు చేయలేకపోతున్నాం’ అని పిట్రోడా వ్యాఖ్యనించారు.
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన అబద్ధాలతో భారత్‌ను ఎగతాళి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. లినక్స్ (BOSS Linux), మాయ ఓఎస్ (Maya OS), ప్రైమ్ ఓఎస్ (PrimeOS), భార్ ఓఎస్ (BharOS), ఇండస్ ఓఎస్ (Indus OS) నెక్స్ట్ క్వాంటమ్ (Nxt Quantum) ఆపరేటింగ్ సిస్టమ్‌లను భారత్ అభివృద్ది చేసిందని ఆయన గుర్తుచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

