హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని భద్రాద్రి-కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు పేర్కొన్నది.
రానున్న 48గంటల్లో హైదరాబాద్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.