Rains | హైదరాబాద్, మే 21 (నమస్తేతెలంగాణ) : నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో బుధవారం నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లో బుధవారం వర్షం కురిసినట్టు తెలిపారు.
రానున్న ఐదు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని, ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో అత్యధికంగా 8.64 సెం.మీ వర్షపాతం నమోదైంది.