హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొన్నిరోజులుగా భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు భానుడి భగభగలు ఉం టుండగా, సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో రానున్న మూడ్రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీలు తకువ నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నది. శుక్రవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.