e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

Mixing Vaccine doses | ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రక్రియ వేగ‌వంతంగా కొన‌సాగుతున్న‌ది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప‌రిశోధ‌న‌ల‌ ప్ర‌కారం మొద‌టి డోస్ ఏ వ్యాక్సిన్‌ను తీసుకుంటే రెండో డోస్ కూడా క‌చ్చితంగా అదే వ్యాక్సిన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే అన్ని దేశాల్లో అదే ప్ర‌కారం వ్యాక్సినేష‌న్ జ‌రుగుతున్న‌ది. కానీ, మొద‌టి డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకున్న‌ వారికి రెండో డోస్ అదే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూడ‌టం అనేది అధికార యంత్రాంగానికి త‌ల‌కు మించిన భారంగా మారింది.

ఈ నేప‌థ్యంలో ఒకే వ్య‌క్తికి రెండు వేర్వేరు కొవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చే వెసులుబాటు ఉంటే బాగుండున‌నే విష‌యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందు కోసం అవ‌స‌ర‌మైన డేటాను సేకరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

అన్ని టీకాల ఉద్దేశం ఒక్కటే.. పనితీరే వేరు

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?
- Advertisement -

ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న కొవిడ్‌ టీకాలన్నీ.. వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించడానికి ఉద్దేశించినవే. అయితే వాటి పనితీరులో వైరుధ్యాలు ఉంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)లోని టీకా విభాగం డైరెక్టర్‌ కేట్‌ ఒబ్రెయిన్ తెలిపారు. ‘టీకాలు పనిచేసే మౌలిక సూత్రం ఒకేలా ఉండటంవల్ల వేర్వేరు డోసులు కూడా పనిచేస్తాయని భావిస్తున్నాం’ అని ఆమె పేర్కొన్నారు.

రెండు వేర్వేరు టీకాలు ఇస్తే ఏమవుతుంది

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, నోవావాక్స్, ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ టీకాలతో వేర్వేరు డోసుల విధానంపై పరిశోధనలు జరుపుతున్నారు. స్పెయిన్, జర్మనీ దేశాల్లోనూ ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. మొదట ఆస్ట్రాజెనెకా టీకా ఆ తర్వాత ఫైజర్ టీకా పొందడం సురక్షితమేనని, ఈ విధానం సమర్థంగానే పనిచేస్తుందని పరిమిత డేటా సూచిస్తున్న‌ది. అయితే ఈ మిశ్రమం వల్ల నొప్పులు, చలి వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు తలెత్తవచ్చని పరిశోధకులు చెప్పారు. కొంద‌రిలో ఈ విధానంవల్ల బలమైన రోగనిరోధక స్పందన వెలువడటం కూడా ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

యూరప్‌లో మొదటి డోసు ఆస్ట్రాజెనికా.. రెండో డోస్‌ ఫైజర్‌

కొన్ని ప్రాంతాల్లో అరుదైన సందర్భాల్లో ఆరోగ్య శాఖ అధికారులు వేర్వేరు డోసులను అనుమతిస్తున్నారు. ఆస్ట్రాజెనికా టీకా అనంతరం కొద్ది మందిలో రక్తంలో గడ్డలు ఏర్పడుతుండ‌టంతో మొదటి డోసు కింద ఈ టీకా పొందినవారు రెండో డోసు కింద ఫైజర్‌ లేదా మోడెర్నా వ్యాక్సిన్‌ను పొందాలని యూరప్‌లో కొన్ని దేశాల్లో వైద్యులు సూచిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా ? మ‌ర‌ణించిన వ్య‌క్తి శ‌రీరంలో వైర‌స్ ఎంత‌సేపు బ‌తికి ఉంటుంది?

monoclonal antibody treatment : ఒక్క‌రోజులోనే క‌రోనా ల‌క్ష‌ణాలు ఖ‌తం? అస‌లేంటి ఆ ట్రీట్‌మెంట్ ? ఎవ‌రికి అవ‌స‌రం ?

coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

Coronavirus Recovery: క‌రోనా త‌గ్గినా నీర‌సంగా ఉంటుందా? ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌ర‌మే

Post Corona symptoms : క‌రోనా త‌గ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి

Double Mask అవ‌స‌ర‌మా? స‌ర్జిక‌ల్‌, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?

COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి

Coronavirus Doubts : నీటి ద్వారా క‌రోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్‌-19 వ‌స్తుందా?

Oxygen : క‌రోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజ‌న్ పొందండి

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Covid-19 deaths : క‌రోనా మృతుల అంత్య‌క్రియ‌ల‌కు వెళ్లొచ్చా? లేదా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న త‌ర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Corona effect : ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఎలా పెంచుకోవాలి

COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!

Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?
Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?
Mixing Vaccine doses : ఒకే వ్య‌క్తికి వేర్వేరు వ్యాక్సిన్ డోసులు సుర‌క్షిత‌మేనా..?

ట్రెండింగ్‌

Advertisement