Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
corona vaccine | సాధారణంగా కొవాగ్జిన్ ( Covaxin ) తొలి డోసు తర్వాత 4 వారాలకు రెండో డోసు వేసుకోవాలి. అదే కొవిషీల్డ్ ( Covishield ) 6-8 వారాల మధ్య తీసుకోవచ్చు.

న్యూఢిల్లీ: మొదట్లో కరోనా వ్యాక్సిన్ ( Corona Vaccine ) తీసుకోవడానికి చాలా మంది వెనుకాడారు. సైడ్ ఎఫెక్ట్స్‌కు భయపడి కొందరు వేసుకోలేదు. ఇప్పుడిప్పుడే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటోంది. అయితే ఇప్పటికీ చాలా మంది వ్యాక్సిన్ల విషయంలో సందేహాలు ఉన్నాయి. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత వైరస్ బారిన పడితే ఎలా అన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. దానికి డాక్టర్లు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా కొవాగ్జిన్ ( Covaxin ) అయితే తొలి డోసు తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు వేసుకోవాలి. అదే కొవిషీల్డ్ ( Covishield ) అయితే 6-8 వారాల మధ్య తీసుకోవచ్చు. కానీ తొలి డోసు తీసుకున్న తర్వాత కరోనా వస్తే.. ఇలా చేయడం కుదరదు. కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత 2-4 వారాల మధ్యే ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇక ఈ మధ్యే కొవిడ్ బారిన పడి కోలుకున్న వాళ్లు వ్యాక్సిన్ తీసుకోవాలంటే కనీసం 1 నుంచి 3 నెలలు ఆగాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్లు వేసుకునే వాళ్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ దాడి చేయదని కాదు. కానీ ఈ వ్యాక్సిన్లు కొవిడ్ తీవ్రతను తగ్గిస్తాయి. మరీ తీవ్రమైన లక్షణాలు లేకుండా, ఆసుపత్రి అవసరం రాకుండా చేయడంలో వ్యాక్సిన్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా కరోనా బారిన పడితే.. ప్రస్తుతానికి మళ్లీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇక కరోనా ఉన్నా లక్షణాలు లేని వ్యక్తి వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో అన్న భయం కూడా కొంత మందిలో ఉంది. కానీ అలాంటి వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఎలాంటి దుష్ప్రభావాలనూ చూపదని డాక్టర్లు చెబుతున్నారు. సహజంగానే కొందరిలో వైరస్‌ను ఎదురించే స్థాయిలో యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయి. మరికొందరిలో వ్యాక్సిన్ ఆ పని చేస్తుంది. ఇక సహజంగా ఉత్పన్నమయ్యే యాంటీ బాడీల కంటే వ్యాక్సిన్ల వల్ల వచ్చే ఎక్కువ కాలం ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
Corona virus FAQs: కరోనా వచ్చిన వారందరూ ఆస్పత్రిలో చేరాలా?
Fitness tips | జిమ్‌లకు వెళ్తున్నారా.. కరోనా వేళలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
corona diet | కరోనాను ఎదుర్కోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలేవి ?
Corona vaccine | క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా.. సురక్షితమేనా?
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

