Fitness tips | జిమ్‌లకు వెళ్తున్నారా.. కరోనా వేళలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Fitness tips | ఫిట్‌గా లేకపోతే కొవిడ్ ( corona ) సులభంగా అటాక్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ ( immunity ) పెంచుకోవడంతోపాటు శారీరక వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

ఫిట్‌గా లేకపోతే కొవిడ్ ( corona ) సులభంగా అటాక్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ ( immunity ) పెంచుకోవడంతోపాటు శారీరక వ్యాయామం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులు జిమ్ (gym ) సెంటర్లలో చెమటలు చిందిస్తున్నారు. బరువులు మోస్తున్నారు.. గుంజీలు తీస్తున్నారు. నిమిషాల కొలదీ నడుము వంచుతున్నారు. అమ్మాయిలు, యువకులు ఇలా అందరూ వారి శక్తికి మించి వ్యాయామం చేస్తున్నారు. అందులో ఆరోగ్యం కోసం..శరీర ఆకృతి కోసం.. మరికొందరు కండల కోసం. అయితే వీరందరూ మాస్క్ ధరించి వ్యాయామం చేస్తున్నారు.
మాస్క్‌తో వ్యాయామం వద్దు
వ్యాయామం సమయంలో చాలామంది మాస్క్ పెట్టుకోవడంతో వైరస్ నుంచి రక్షించుకుంటున్నామని భ్రమపడుతుంటారు. మాస్క్ ధరించి వ్యాయామం చేస్తే ఊపిరిత్తులు పాడయ్యే ప్రమాదం ఉంటుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ ఎక్కువగా అందదు. చాలామంది కరోనా భయంతో బిగుతుగా ఉన్న మాస్క్‌లు పెట్టుకుంటారు. అలా పెట్టుకుని వెయిట్ లిఫ్టింగ్ చేసిన సమయంలో, రన్నింగ్, జాగింగ్ చేసే సమయంలో ఏ గాలినైతే మనం వదులుతామో.. అదే గాలిని పీల్చుకుంటాం. దానివల్ల కార్బన్ డయాక్సైడ్ రక్తంలో వృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం.
జిమ్‌లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- మెడిసిన్ వాడుతున్న వారు వైద్యుల సూచన లేకుండా వ్యాయామం చేయకూడదు.
- వ్యాయామం సమయంలో మాస్క్‌లు ధరించకూడదు.
- సులభంగా మూవ్మెంట్ ఉండేలా డ్రెస్సు ధరించాలి. గాలి వీచేలా ఉండాలి.
- ఏదైన వస్తువును తాకినప్పుడు చేతులను శానిటైజ్ చేసుకోవాలి.
- ఒకే రకమైన వ్యాయామం చేయడం ప్రమాదం.
- హిమోగ్లోబిన్ నార్మల్‌గా ఉన్నప్పుడే వ్యాయామం చేయాలి.
- ఒంటి నుంచి చెమట ఎంత వస్తే…శరీర క్రియాశీలక వ్యవస్థ మెరుగ్గా ఉన్నట్టు.
- వ్యాయామానికి ముందు బాదం, కర్జూర తింటే శ్రేయస్కరం. అవి ఆక్సిజన్ అందించే సామర్థ్యాన్ని పెంచుతాయి.
కరోనా వేళలోనూ తగ్గని క్రేజ్
వెయిట్‌లాస్, వెయిట్ గెయిన్ కోసం ఎక్కువగా జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇంకొంతమంది ఫిట్నెస్ కోసం వస్తున్నారు. మొత్తంగా జిమ్‌లలో పలురకాల పరికరాలతో కసరత్తు చేసి చెమటలు చిందిస్తున్నారు. కంప్యూటర్లపై పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. మహిళలు… ఎక్కువగా అధిక బరువు, థైరాయిడ్ లాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు జిమ్‌లకు వెళ్తుంటారు.
వ్యాయామంలో మాస్క్ ధరించొద్దు
వ్యాయామం సమయంలో మాస్క్‌లు ధరించకూడదు. మాస్క్‌లు ధరించి వ్యాయామం చేస్తే నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిపడా అందదు. శ్వాస సమస్యలు వస్తాయి. -డాక్టర్ విజయ్‌కుమార్, పల్మనాలజిస్ట్
ఇవి కూడా చదవండి..
Food safety tips : ఫ్రిజ్‌లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?
corona diet | కరోనాను ఎదుర్కోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోగనిరోధకశక్తిని పెంచే పదార్థాలేవి ?
Immunity boosters : కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇవి చాలా అవసరం
Corona vaccine | క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా.. సురక్షితమేనా?
pulse oximeter : పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా ఉపయోగించాలి?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

