Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Sachin - Sara : భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అనుబంధాలకు ఎంతో విలువిస్తాడు. మాజీ గురువులు, సహచరులను మరచిపోని అతడు.. తమ కూతురుసారా టెండూల్కర్ (Sara Tendulkar)కు ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు.
Sachin – Sara : భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అనుబంధాలకు ఎంతో విలువిస్తాడు. మాజీ గురువులు, సహచరులను మరచిపోని అతడు.. తమ కూతురుసారా టెండూల్కర్ (Sara Tendulkar)కు ప్రేమగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. తండ్రిచాటు బిడ్డలా కాకుండా సొంతంగా వ్యాపారంలో రాణిస్తున్న సారాను చూసి తాను చాలా సంతోషిస్తున్నానని సచిన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. క్రికెట్ గాడ్ అయిన మాస్టర్ బ్లాసర్ పోస్ట్‌కు ఆమె సైతం అంతే ప్రేమగా స్పందించింది.
క్రికెట్ లెజెండ్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ 29వ వసంతంలో అడుగుపెట్టింది. సోమవారం తన పుట్టిన రోజును పునస్కరించుకొని సచిన్ తనపై ఒకప్పుడు చూపించిన ప్రేమ.. ఇప్పుడు తను స్వశక్తితో ఎదిగిన తీరును ప్రశంసిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. తమ కుటుంబ వేడుకలో పక్కపక్కనే కూర్చొని దిగిన ఫొటోను పంచుకున్నాడీ మాస్టర్ బ్లాస్టర్. ‘ఒకప్పుడు నేను నీకు దారి చూపేవాడిని. అప్పటిలా ఇప్పుడు అన్నీ చెప్పడం లేదు. కానీ, నువ్వు ఎంచుకున్న దారిని చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. సారా. లవ్ యూ’ అని తమ గారాలపట్టిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూనే సొంత వ్యాపారంలో రాణిస్తున్నందుకు అమితానందం వ్యక్తం చేశాడు.
తండ్రి పోస్ట్‌కు సారా మూడు చాక్లెట్ రంగు హార్ట్ ఎమోజీలతో స్పందించింది. జెన్‌జీ విరివిగా ఉపయోగించే ఈ ఎమోజీ.. ఎనలేని ప్రేమకు, అనుబంధానికి ప్రతీక. సచిన్ తన బిడ్డకు తనకిష్టమైన ఆటతో అనుబంధానికి గుర్తుగా సారా అనే పేరు పెట్టాడు. 1997లో సచిన్ కెప్టెన్సీలోని భారత జట్టు ‘సహారా కప్’ (Sahara Cup) విజేతగా నిలిచింది. అది కూడా పాకిస్థాన్‌ను ఫైనల్లో చిత్తుగా ఓడించి. సారథిగా తనకు దక్కిన సహార కప్ విజయానికి గుర్తుగా.. అదే ఏడాది అక్టోబర్ 12న తనకు పుట్టిన పాపాయికి సారా అని నామకరణం చేశాడు సచిన్.
వెల్నెస్’ రంగంలో అడుగు
తండ్రి క్రికెట్ దిగ్గజమైనందను అన్న అర్జున్ బంతి చేతబట్టినా.. సారా మాత్రం ఆవైపు అడుగేయలేదు. బయోమెడికల్ సైన్స్‌లో డిగ్రీ.. ఆ తర్వాత క్లినికల్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్లో పీజీ చదివిన తను కొన్నిరోజులు మోడల్‌గానూ మెరిసింది. సామాజిక బాధ్యతలోనూ భాగమవుతూ.. తమ కుటుంబం నిర్వహిస్తున్న ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’లో డైరెక్టర్‌గా చేరింది సారా. తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలలని ‘వెల్నెస్’ రంగంలో అడుగు పెట్టింది. నిరుడు ముంబైలో తను ‘పిలాటిస్ అకాడమీ’ (Pilates Academy)కి శ్రీకారం చుట్టి ఈ తరానికి ఫిట్నెస్, వెల్నెస్ పాఠాలు బోధిస్తోందీ బ్యూటిఫుల్ లేడీ.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

