Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి అన్నారు.
శివ్వంపేట : తెలంగాణ సంస్కృతి ( Sunitha Lakshma Reddy) , సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ( Bathukamma ) ప్రతీకగా నిలుస్తుందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ( Sunitha Lakshma Reddy) అన్నారు. ఆదివారం తన నివాసంలో సద్దుల బతుకమ్మను తీరొక్క పూలతో కుటుంబ సభ్యులతో కలసి అందంగా అలంకరించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పండుగ శోభను చాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి,సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ పూలతో జరుపుకునే పండుగ తెలంగాణలో ప్రత్యేకతను చాటుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వెంట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు హనుమంత్ రెడ్డి, బిక్షపతి రెడ్డి, కుంట లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

