Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
Jagadish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక చేతులెత్తేసిందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు.
సూర్యాపేట : రాష్ట్రంలో కాంగ్రెస్ ( Congerss ) ప్రభుత్వానికి పాలన ( Govern ) చేతకాక చేతులెత్తేసిందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadish Reddy) దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం స్కాములు, వాటాల కొరకే పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్టంలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనపడుతున్నా ఇంకా ప్రభుత్వం మొద్దు నిద్ర విడువడం లేదని అన్నారు.
తెలంగాణ నుంచి పారుతున్న నీళ్లతోనే ఆంధ్ర లబ్ధిపొందుతుందని ఇప్పటివరకు కృష్ణలో తెలంగాణ 18 టీఎంసీ ల నీళ్లు కూడా వాడలేదని వెల్లడించారు. కన్నెపల్లి పంపు హౌస్ ఆన్ చేస్తే ప్రతీ చెరువు మత్తడి దునికేది. తెలంగాణ ప్రాజెక్ట్ లు అన్నీ నిండుకుండలా ఉండేవి. గోదావరి నుంచి 250 టీఎంసీలు ఎత్తుకునే వాళ్లం. కేసీఆర్ హయాంలో తెలంగాణకు కరువు అనేదే లేకుండే. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేదని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరక్ష్యం వల్లనే కరువు పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుకు తట్టేడు మట్టి, మాలు అవసరం లేకుండానే ప్రారంభించవచ్చని వివరించారు.కేసీఆర్ హయాంలో రెప్పపాటు కరెంట్ పోనీ రాష్ట్రంగా రికార్డు స్టష్టించిందని కొనియాడారు. ప్రయివేట్ బొగ్గు కమిషన్లకు ఆశపడి సింగరేణిని బదనాం చేస్తున్నారని మాజీ మంత్రిఇ ఆరోపించారు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి రాగానే అన్నింటిని ఎలా పునరావృతం చేసుకోవాలో తమకు తెలుసని అన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

