e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ ( pulse oximeter ).. ఇప్పుడు ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు ఇది. ఒక‌ప్పుడు జ్వ‌రం వ‌స్తే వాడే థ‌ర్మామీట‌ర్ గురించి మాత్రమే అంద‌రికీ తెలుసు. కానీ ఇప్పుడు క‌రోనా పుణ్యమా అని శ‌రీరంలో ఆక్సిజ‌న్ స్థాయుల‌ను చెక్ చేసే ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ గురించి కూడా చాలామందికి తెలిసిపోయింది. క‌రోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తోనే బాధ‌ప‌డుతున్నారు. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ప‌డిపోవ‌డంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో శ‌రీరంలోని ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మానిట‌ర్ చేసుకుంటూ.. ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి ఈ ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. అందుకే ప్ర‌తి ఒక్క‌రూ ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ల‌ను ద‌గ్గ‌ర ఉంచుకోవ‌డం మంచిద‌ని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలో అస‌లు ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది. దాని ఎలా ఉప‌యోగించాల‌నే వివ‌రాలు ఇప్పుడు చూద్దాం..

pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ( pulse oximeter ) అంటే ఏంటి?

మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లో ఫిల్ట‌ర్ అవుతుంది. ఆ త‌ర్వాత ఎర్ర ర‌క్త క‌ణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ద్వారా శ‌రీరం మొత్తం ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అవుతుంది. హిమోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజ‌న్ స్థాయిని ప‌ల్స్ ఆక్సీమీట‌ర్లు లెక్కిస్తాయి. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ చిన్న క్లిప్ మాదిరి ఉంటుంది. దీన్ని చేతి వేలికి గోరు భాగంలో పెట్టుకోగానే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను రీడింగ్ రూపంలో చూపిస్తుంది. సాధార‌ణంగా ఆరోగ్యంగా ఉన్న వారిలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 95 నుంచి 99 శాతం వ‌ర‌కు ఉంటాయి. అదే ఆక్సిజ‌న్ 92 శాతం వ‌ర‌కు స్థిరంగా ఉంటే ఫ‌ర్వాలేదు. కానీ అంత‌కంటే త‌గ్గితే మాత్రం వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది.

Read More : vaccine registration : 18 ఏళ్లు పైబడిన వారు క‌రోనా టీకా కోసం ఇలా రిజిస్ట‌ర్ చేసుకోండి

ఎలా ప‌నిచేస్తుంది?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను చేతి వేలికి పెట్టుకోగానే.. అది ఇన్‌ఫ్రారెడ్ కిర‌ణాల‌ను ర‌క్త‌కేశ నాళిక‌ల్లోకి పంపుతుంది. అప్పుడు ఇన్‌ఫ్రారెడ్ కిర‌ణాల నుంచి వెలువ‌డిన కాంతిని ర‌క్త‌నాళాల‌ను గ్ర‌హించడంలో వ‌చ్చే మార్పు ఆధారంగా ఇది ఆక్సిజ‌న్ శాతాన్ని కొలుస్తుంది. ఆక్సీమీట‌ర్ హృద‌య స్పంద‌న రేటు కూడా చూపిస్తుంది. ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను ఎక్కువ‌గా చూపుడు వేలుకు పెట్టుకుంటారు. మ‌ధ్య వేలుకు ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను పెట్టుకొని కూడా ఆక్సిజ‌న్ లెవల్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఇది 98 శాతం క‌చ్చిత‌మైన రీడింగ్ చూపిస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ReadMore: Vaccine Doubts : మొద‌టి డోస్ కోవాగ్జిన్‌, రెండో డోస్ కోవిషీల్డ్ తీసుకోవ‌చ్చా?

pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ఉప‌యోగించాలి?

  • చేతి గోళ్ల‌కు ఏదైనా నెయిల్ పాలిష్ ఉంటే తొల‌గించాలి.
  • చేతులు చ‌ల్ల‌గా ఉంటే వెచ్చ‌ద‌నం కోసం రెండు నిమిషాలు చేతులు రుద్దుకోవాలి.
  • ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ వాడే ముందు క‌నీసం 5 నిమిషాలు ఏ ఆలోచ‌న లేకుండా విశ్రాంతి తీసుకోవాలి.
  • ఆ త‌ర్వాత‌ చేతిని ఛాతిపై ఉంచాలి. అనంత‌రం ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌ను క‌నీసం నిమిషం సేపు చేతి వేలికి ఉంచాలి.
  • రీడింగ్ స్థిరంగా చూపించేవ‌ర‌కు అలాగే ఉంచాలి. క‌నీసం 5 సెక‌న్ల పాటు రీడింగ్‌లో ఎలాంటి మార్పు లేక‌పోతే దాన్ని అత్య‌ధిక రికార్డుగా భావించాలి.
  • ఆక్సిజ‌న్ లెవ‌ల్స్‌ను ప్ర‌తిరోజు ఒకే స‌మ‌యంలో మూడుసార్లు రికార్డు చేయాలి.
  • ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపించినా.. ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ 92 శాతం త‌క్కువ‌గా ఉన్నా వైద్య స‌హాయం కోసం 1075కి కాల్ చేయాలి. లేదా వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఒక్క మాస్క్ స‌రిపోదా? రెండు మాస్కులు క‌చ్చితంగా వాడాలా?

Vaccine Doubts : క‌రోనా వ్యాక్సిన్ రెండు డోసులు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సిందేనా? ఒక్క డోస్ స‌రిపోదా?

కొవిడ్ సెకండ్‌ వేవ్ భిన్నం.. వ‌చ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?

Corona effect : భార‌త్ నుంచి ప్ర‌యాణాల‌పై ఆస్ట్రేలియా ఆంక్ష‌లు

దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్‌ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి

మే మూడో వారంలో కరోనా మ‌రింత ఉద్ధృతం: ఎస్‌బీఐ రిపోర్ట్‌

గుజ‌రాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం

బోర్లా ప‌డుకుంటే ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ పెరుగుతాయా.. ఆ వైర‌ల్ వీడియోలో నిజ‌మెంత‌?

Corona effect : ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ ఎలా పెంచుకోవాలి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
pulse oximeter : ప‌ల్స్ ఆక్సీమీట‌ర్ ఎలా ప‌నిచేస్తుంది? దాన్ని ఎలా ఉప‌యోగించాలి?

ట్రెండింగ్‌

Advertisement