మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్

న్యూఢిల్లీ: కరోనా పీడ ఇప్పుడప్పుడే విరగడయ్యేలా కనిపించడం లేదు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజా అధ్యయనం ప్రకారం.. మే మూడో వారంలో కరోనా సెకండ్ వేవ్ మరింత ఉద్ధృతం కానుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రికవరీ రేట్లు పెరుగుతూ ఉంటే ఇండియాలో మాత్రం తగ్గుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిబ్రవరిలో ఇండియా రికవరీ రేటు అత్యధికంగా 97.3 శాతానికి చేరింది. అయితే అప్పటి నుంచీ సెకండ్ వేవ్ మొదలు కావడంతో క్రమంగా తగ్గుతూ తాజాగా 85 శాతానికి చేరడం గమనార్హం.
ఈ రికవరీ రేటు 78-79 శాతానికి చేరినప్పుడు కరోనా సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరి 15 నుంచి పీక్ టైమ్‌ను 96 రోజులుగా అంచనా వేసినట్లు ఎస్బీఐ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కాంతి ఘోష్ వెల్లడించారు. ఆ లెక్కన మే మూడో వారంలో సెకండ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతానికి రోజువారీ కేసులను పరిశీలిస్తే కిందట రోజు కంటే కనీసం 15 వేల కేసులు ఎక్కువగా వస్తున్నాయి.
మహారాష్ట్రలో కొత్త కేసుల సంఖ్య ఓ స్థాయికి చేరి అక్కడే స్థిరంగా ఉండిపోయింది. కానీ యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో మాత్రం కేసులు సంఖ్య పెరిగిపోతోంది. మహారాష్ట్ర పీక్ ఆగిపోయింది కాబట్టి.. అక్కడి నుంచి రెండు వారాల్లో ఈ రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య గరిష్ఠానికి తాకి అక్కడే స్థిరంగా ఉండే అవకావం ఉన్నట్లు ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించింది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియా వాస్తవిక జీడీపీ 10.4 శాతంగా ఉండనున్నట్లు ఎస్బీఐ అంచనా వేసింది. రోజుకు కరోనా కేసులు మూడు లక్షలకు వరకూ చేరవచ్చని గతంలోనే ఎస్బీఐ అంచనా వేసింది. అందుకు తగినట్లే ఇప్పుడు కేసులు అంతకు మించి నమోదవుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

