దేశంలో అందుబాటులోకి మరో ఔషధం.. జైడస్ క్యాడిలా ఔషధానికి డీసీజీఐ అనుమతి
జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి | దేశంలో మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2బీ, ‘విరాఫిన్’కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.
న్యూఢిల్లీ : దేశంలో మరో కరోనా ఔషధం అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా కంపెనీకి చెందిన ‘విరాఫిన్’కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. జైడస్ అందించిన డేటాపై నిపుణుల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే కంపెనీ మూడో దశల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ప్రయోగాల్లో కేవలం సింగిల్ డోసులతోనే మెరుగైన ఫలితాలు వచ్చినట్లు సంస్థ ఇటీవల వెల్లడించింది. విరాఫిన్ ను సాంకేతికంగా ‘పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2బీ’(PegIFN)గా పిలుస్తారు. కరోనా రోగులకు చికిత్స కోసం పెగిలేటెడ్ ఇంటర్ఫెరాన్ ఆల్ఫా-2బీ ఔషధంపై జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది.
ఇందుకోసం దాదాపు 250 కరోనా రోగులపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేపట్టింది. ఈ ఔషధం తీసుకున్న ఏడు రోజుల్లో 91.15శాతం రోగుల్లో కరోనా నెగెటివ్ (ఆర్టీపీసీఆర్) వచ్చినట్లు ప్రయోగాల్లో గుర్తించింది. అంతేకాకుండా రోగులకు ఆక్సిజన్ అవసరమయ్యే సమయాన్ని 80గంటల నుంచి 56గంటలకు తగ్గించినట్లు తేలింది. కొవిడ్ రోగులకు ఒక్క డోసు ఇవ్వడం ద్వారా వారిలో మెరుగైన ఫలితాలు వస్తున్నట్లు కనుగొంది. ఈ PegIFN ఔషధాన్ని కరోనా రోగులకు ఇవ్వడం ద్వారా వైరస్ నుంచి త్వరగా కోలుకోవడంతో పాటు తీవ్ర సమస్యల నుంచి బయటపడవచ్చని జైడస్ క్యాడిలా వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం రెండు కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని దేశవ్యాప్తంగా ప్రభుత్వం అత్యవసరంగా వినియోగిస్తోంది. ఇటీవల రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు జారీ చేసింది. ఈ రెండు టీకాలు అందుబాటులోకి వస్తే టీకాల పంపిణీ మరింత వేగవంతం కానుంది. ప్రస్తుతం దేశంలో రికార్డు స్థాయిలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. రెండు రోజులుగా మూడు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవగా.. రెండువేలకు పైగా మరణాలు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇది నేషనల్ ఎమర్జెన్సీ
డబుల్ మాస్కుతో డబుల్ రక్షణ
ఆక్సిజన్కు ఎందుకింత కష్టం?
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
దేశంలో కొవిడ్ పరిస్థితిపై నేడు ప్రధాని వరుస సమీక్షలు
మంత్రి కేటీఆర్కు కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 3.32 లక్షల కేసులు
తెలంగాణలో కొత్తగా 6,206 కరోనా కేసులు
మహారాష్ట్ర ఘటనపై ప్రధాని, రక్షణ మంత్రి సంతాపం
వ్యాక్సిన్ ధరల్లో ఏకరూపత ఉండాలి : మాయావతి
పాక్కు వెళ్లొచ్చిన 200 మందికి కరోనా
ప్లాంట్ లేకపోతే ఆక్సిజన్ అందదా? : ప్రధానితో ఢిల్లీ సీఎం
కేంద్రమే బాధ్యత వహించాలి : రాహుల్ గాంధీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్


