Dulquer Salmaan | మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఐ యామ్ గేమ్’ (I’m Game). ఆర్డీఎక్స్’ (RDX) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన నహాస్ హిదాయత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. వేఫేరర్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాను ఓనమ్ పండగ కానుకగా ఆగస్టు 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. 2023లో వచ్చిన ‘కింగ్ ఆఫ్ కోత’ తర్వాత దుల్కర్ సల్మాన్ మళ్లీ మలయాళ సినిమా చేస్తుండటంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో ఆంటోనీ వర్గీస్ పెపే, ఐశ్వర్య లక్ష్మి, తమిళ్ దర్శకుడు మిస్సిన్, కతీర్, కాయాదు లోహర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదల కానుంది.
The countdown ends and the real game begins! 💥 ‘I’m Game’ is locked, loaded, and arriving in theaters this August 20 for the ultimate Onam celebration! 🥁🔥 Get ready to witness the magic on the big screen. 🎬✨
#ImGameMovie #August20 #FestivalEntertainer@NAHASKh1… pic.twitter.com/4JMamcBu9d— Dulquer Salmaan (@dulQuer) May 20, 2026