Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి | కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని చెబుతోంది.

Corona effect : కరోనా సంక్షోభం చేయిదాటిపోతోంది !! దవాఖానాల్లో ఆక్సిజన్ కొరత ఇప్పుడు కలవరపెడుతోంది !! తెలంగాణ సర్కార్ ముందుచూపుతో వ్యవహరించడం వల్ల ప్రస్తుతానికైతే రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో ఆక్సిజన్ నిల్వలకు కొరత లేదు. కానీ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఇప్పుడు తీవ్రంగా ఉంది. అక్కడి పరిస్థితులను చూస్తే మిగతా రాష్ట్రాల్లో భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఇందుకు కారణం కరోనా సెకండ్ వేవ్‌లో ఎక్కువ మంది రోగులు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడటమే. వారికి కావాల్సిన ఆక్సిజన్ అందిస్తుండటంతో ఈ కొరత సమస్య తలెత్తుతుంది. ఈ క్రమంలో కొవిడ్-19 రోగులు శ్వాస సమస్యలను అధిగమించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. బోర్లా పడుకుని బలంగా శ్వాస పీల్చడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని చెబుతోంది. ఈ విధానాన్ని ప్రోనింగ్ ( Proning ) అంటారని తెలిపింది.
ఛాతి, పొట్టపై బరువు పడేలా బోర్లా పడుకుని లేదా ఒక పక్కకు పడుకుని శ్వాస తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు కావాల్సినంత ఆక్సిజన్ అందుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. బోర్లా పడుకుని శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చని ఇటీవల ఒక వీడియో వైరల్ కూడా అయిన సంగతి తెలిసిందే. ప్రోనింగ్ పొజిషన్ ( Proning position ) అని పిలిచే ఈ విధానం వైద్యపరంగా ధ్రువీకరణ పొందిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఐసోలేషన్‌లో ఉన్న కరోనా రోగులు ఈ ప్రక్రియ ఎంతో మేలు చేస్తుందని తెలిపింది.
Read more: 18 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి
ప్రొనింగ్ పొజిషన్ ఎలా
మంచంపై ముందు బోర్లా పడుకోవాలి. తర్వాత మెడ కింది భాగంలో ఒక దిండును పెట్టుకోవాలి. ఛాతి నుంచి కింద వరకు రెండు దిండ్లను ఉంచుకోవాలి. మరో రెండు దిండ్లను మోకాలి కింద పెట్టుకోవాలి. ఈ ఒక్క భంగిమలోనే కాకుండా వివిధ యాంగిల్స్‌లో కూడా విశ్రాంతి తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్కో పొజిషన్లో 30 నిమిషాల కంటే ఎక్కువగా పడుకోవద్దు. ఆక్సిజన్ లెవల్స్ 94 శాతం కంటే తక్కువకు పడిపోతున్న సమయంలో ఈ ప్రోనింగ్ అవసరం.
#Unite2FightCorona
— Ministry of Health (@MoHFW_INDIA) April 22, 2021
Proning as an aid to help you breathe better during #COVID19 pic.twitter.com/FCr59v1AST
Read more: బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి
- భోజనం చేసిన గంట వరకు ఈ ప్రోనింగ్ చేయకూడదు
- మనకు సౌకర్యంగా అనిపించినంత వరకు ఎన్నిసార్లు అయినా ఈ ప్రొనింగ్ చేయవచ్చు.
- ఒకరోజులో వివిధ సమయాల్లో గరిష్టంగా 16 గంటలు ఈ ప్రాసెస్ పాటించవచ్చు.
- మన సౌకర్యం కోసం దిండును అటు ఇటు కదుపుకోవచ్చు.
- గర్భిణులు, హార్ట్ పేషెంట్స్, వెన్నెముక సమస్యలు ఉన్న వారు ఈ విధానానికి దూరంగా ఉండాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

