vaccine registration నేటి నుంచే : 18 ఏళ్లు పైబడిన వారు ఇలా రిజిస్టర్ చేసుకోండి
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ | 18 ఏళ్లు నిండిన అందరికీ మే 1 నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈనెల 24 నుంచి రిజిస్టర్ చేసుకోవచ్చు.

corona vaccine registration : సెకండ్‌వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 1వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ 4 గంటలకు ప్రారంభం కానుంది. వ్యాక్సిన్ పొందాలనుకునేవారు ఈ CoWIN వెబ్‌పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 18 ఏళ్లు నిండిన అందరికీ టీకా ఇవ్వడం వల్ల టీకా కేంద్రాలకు వచ్చే వాళ్లతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున టీకా కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవడం కుదరదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కొవిన్ వెబ్సైట్లో టీకా కోసం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకుందాం..
కొవిన్ వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి
- ముందుగా కొవిన్ పోర్టల్ ( cowin.gov.in ) ఓపెన్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- మొబైల్‌కు వచ్చిన ఓటీపీని వెబ్సైట్లో ఎంటర్ చేసి, వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు రిజిస్ట్రేషన్ ఫర్ వ్యాక్సినేషన్ అని పేజి ఓపెన్ అవుతుంది.
- అందులో ఫొటో గుర్తింపు కార్డును ఎంచుకుని దాని నంబర్‌తో పాటు పేరు, పుట్టిన సంవత్సరం వంటి వివరాలను నమోదు చేసి రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ అనంతరం ఏ రోజు టీకా వేయించుకోవాలో షెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా షెడ్యూల్ బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజి ఓపెన్ అవుతుంది.
- అందులో మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయగానే.. అందుబాటులో ఉన్న టీకా కేంద్రాల జాబితా కనిపిస్తుంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని సెలెక్ట్ చేసుకుని కన్ఫార్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే షెడ్యూల్ తేదీలను కూడా మార్చుకునే వెసులుబాటు ఉంది.
- కొవిన్ వెబ్‌సైట్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
ప్రజలకు విజ్ఞప్తి.. ప్రయాణాలు వద్దు : మంత్రి ఈటల
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

