గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం

అహ్మాదాబాద్ : కొవిడ్ కేసుల పెరుగుదలతో దేశవ్యాప్తంగా దవాఖానల్లో ఆక్సిజన్ పడకల కొరత నెలకొనగా దళారీలు ఆపద సమయంలోనూ సొమ్ము చేసుకుంటున్నారు. గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఓ ఏజెంట్ కొవిడ్ బెడ్ కోసం రోగి బంధువులతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూ 9000 ఇస్తే అరగంటలోనే ప్రభుత్వ దవాఖానలో బెడ్ ఇప్పిస్తానని జగదీష్ సోలంకి, హితేష్ మహిద అనే నిందితులు నమ్మబలుకుతూ ఈ వీడియోలో కనిపించారు.
నిందితులు ఇద్దరూ జామ్ నగర్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరిలో సోలంకి దవాఖానలో అటెండెంట్ కాగా, హితేష్ స్వీపర్ గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ దవాఖానలో ఆక్సిజన్ బెడ్స్ కోసం పలువురు కొవిడ్-19 రోగులు గంటల తరబడి వేచిచూస్తున్న పరిస్థితి నెలకొనగా విపత్తు వేళ ఇలాంటి రాబందులు సొమ్ము చేసుకునేందుకు తెగబడటం దారుణమని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Covid-19
- Gujarat
- Oxygen beds
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

