Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
Corona effect : భారత్‌లో కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలు జరిపే విమానాల సంఖ్యను తగ్గిస్తూ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది.

భారత్‌లో కరోనావైరస్ ( coronavirus ) విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ నుంచి రాకపోకలపై మరో దేశం ఆంక్షలు విధించింది. భారత్ సహా రెడ్ జోన్ దేశాల నుంచి రాకపోకలు జరిపే విమానాల సంఖ్యను తగ్గిస్తూ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఈ నిబంధనతో భారత్ నుంచి డైరెక్ట్‌గా సిడ్నీ వెళ్లే 30 శాతం విమానాలు రద్దు కానున్నాయి. సెకండ్ వేవ్ ( secondwave ) మొదలైన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి ప్రయాణాలపై ఆంక్షలు విధించిన దేశాల జాబితా ఒకసారి చూద్దాం..
అమెరికా
భారత్‌లో సోమవారం ఒక్కరోజే 2.73 లక్షల కేసులు నమోదు కావడంతో అమెరికా అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి అత్యధికంగా ఉన్న జాబితాలో భారత్‌ను చేరుస్తూ అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటేషన్(సీడీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ భారత్‌కు వెళ్లవద్దని తమ దేశ పౌరులకు సీడీసీ సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో పర్యటించడం వల్ల వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా విభిన్న కరోనా వేరియంట్ల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
బ్రిటన్
భారత్ పర్యటనను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రద్దు చేసుకున్న కొద్దిగంటల్లోనే రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. దీంతో ఇప్పటివరకు బ్రిటన్ ప్రయాణ ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో 40వ స్థానంలో భారత్ నిలిచింది. బ్రిటిష్, ఐరిష్ పాస్‌పోర్టులు ఉన్న వారు మినహా.. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఏప్రిల్ 23 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. బ్రిటన్‌లో 100కు పైగా ఇండియన్ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో బ్రిటన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సింగపూర్
భారత్‌లో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై క్వారంటైన్ నిబంధనలను సింగపూర్ కఠినతరం చేసింది. భారత్ నుంచి తమ దేశం వచ్చే ప్రయాణికులు 14 రోజుల క్వారంటైన్ ముగిసిన తర్వాత అదనంగా మరో వారం రోజుల పాటు గృహనిర్బంధంలోనే ఉండాలని సూచించింది. ఈ కొత్త నిబంధన గురువారం నుంచి అమలు కానుంది.
న్యూజిలాండ్
కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యాక భారత్ నుంచి రాకపోకలపై తొలిసారిగా న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై రెండు వారాలపాటు నిషేధం విధిస్తూ ఆ దేశ ప్రధాని జెసిండా అర్నెర్డ్ ఏప్రిల్ 8న నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై పోరులో న్యూజిలాండ్ దాదాపు పై చేయి సాధించింది. 40 వారాలపాటు విదేశాల నుంచి వచ్చే వారు మినహా స్థానికంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 23 మందికి పాజిటివ్ నిర్ధరణ కాగా, అందులో 17 మంది భారత్ నుంచే వచ్చిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ నుంచి ప్రయాణాలపై న్యూజిలాండ్ ఆంక్షలు విధించింది.
హాంకాంగ్
భారత్‌తో పాటు పాకిస్తాన్, ఫిలిప్పిన్స్ నుంచి రాకపోకలను రద్దు చేస్తూ హాంకాంగ్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఈ మూడు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు అత్యధికంగా కరోనా స్ట్రెయిన్ వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ నుంచి హాంకాంగ్ వెళ్లిన 53 మంది ప్రయాణికులకు కొవిడ్-19 వచ్చినట్లు సమాచారం.
పాకిస్థాన్
భారత్ నుంచి రెండు వారాల పాటు రాకపోకలను నిషేధిస్తూ పాకిస్థాన్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. కొత్తరకం కరోనా వేరియంట్ వ్యాప్తి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ రాకపోకలను నిషేధించింది. రెండు వారాల పాటు రోడ్డు, విమాన మార్గాలపై ఈ నిషేధం ఉంటుందని పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Corona second wave | చిన్నారులకు కరోనా వస్తే కనిపించే లక్షణాలివే..
లాభం తీసుకోకుండానే వ్యాక్సిన్లు ఇస్తాం.. ఇండియాకు ఫైజర్ ఆఫర్
కరోనా పరీక్షల కోసం వచ్చి.. కన్నుమూశాడు
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
కరోనా అలర్ట్ : రెమ్డిసివిర్ రామబాణం కాదు
డాక్టర్ ను బలిగొన్న మహమ్మారి : మరణానికి 36 గంటల ముందు..
95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా
భారత్‌లో కరోనాతో భర్త మృతి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన చైనాలోని భార్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

