Corona second wave | చిన్నారులకు కరోనా వస్తే కనిపించే లక్షణాలివే..
Corona Virus | మొదటి దశలో చిన్నారుల్లో కరోనా లక్షణాలు పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా ( corona ) సెకండ్ వేవ్ తీవ్రంగా ఉంది. వరుసగా ఏడో రోజు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. మొదటి దశలో చిన్నారులపై కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ సెకండ్ వేవ్ ( second wave )లో పంజా విసురుతోంది. ముఖ్యంగా చిన్నారులు, 18 ఏండ్ల వయసులోపు ఉన్నవారికి సంబంధించి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి దశలో చిన్నారుల్లో లక్షణాలు పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్తగా పుట్టుకొస్తున్న కరోనా వైరస్ మ్యుటేషన్ల ( corona new variants ) వల్ల 18 ఏళ్లలోపు వారికి కూడా కరోనా సోకుతుందని వైద్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల్లో కనిపించే corona లక్షణాలేంటి
చిన్నారుల్లో సాధారణంగా జ్వరం, గొంతునొప్పి, పొడిదగ్గు ఉంటే కరోనా అయి ఉండొచ్చని అనుమానించాలి. కొందరిలో వాంతులు, విరేచనాలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కూడా ఉంటున్నాయి. అయితే సెకండ్ వేవ్లో చిన్నారుల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. కళ్లు ఎర్రబడటం, చర్మంపై దద్దుర్లు, సృహ కోల్పోవడం, గోర్లు నీలం రంగులోకి మారడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా టెస్ట్ చేపించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
corona సోకిన తల్లి.. బిడ్డకు పాలివ్వొచ్చా
కొద్దిపాటి లక్షణాలుంటే మాత్రం బిడ్డను దగ్గరికి తీసుకోవచ్చు. మాస్కుతో పాటు గ్లౌజులు పెట్టుకొని బిడ్డకు పాలు ఇవ్వొచ్చు. ముఖ్యంగా తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా అలర్ట్ : రెమ్డిసివిర్ రామబాణం కాదు
డాక్టర్ ను బలిగొన్న మహమ్మారి : మరణానికి 36 గంటల ముందు..
95 రోజుల్లోనే 13 కోట్ల మందికి కోవిడ్ టీకా
భారత్లో కరోనాతో భర్త మృతి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన చైనాలోని భార్య
కోవీషీల్డ్ వ్యాక్సిన్ ధరలు ప్రకటించిన సీరం సంస్థ
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

