Watch: తాత, నానమ్మ నుంచి బాలిక కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?
girl kidnapped | స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తాత, నానమ్మ చేతుల్లోంచి లాక్కెళ్లారు. కారులో తీసుకెళ్లారు. తాత, నానమ్మ ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది.
చండీగఢ్: స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన బాలికను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తాత, నానమ్మ చేతుల్లోంచి లాక్కెళ్లారు. కారులో తీసుకెళ్లారు. తాత, నానమ్మ ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. (girl kidnapped) పంజాబ్‌లోని మొహాలీలో ఈ సంఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికను తాత, నానమ్మ కలిసి స్కూల్ నుంచి స్కూటీపై ఇంటి వద్దకు తీసుకువచ్చారు. వృద్ధురాలు గేటు తీస్తుండగా మరో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. తాత వద్ద ఉన్న బాలికను తీసుకునేందుకు ప్రయత్నించారు.
కాగా, అంతలోనే ఒక కారు అక్కడకు చేరుకున్నది. కారు నుంచి దిగిన వ్యక్తులు ఆ బాలికను కిడ్నాప్ చేశారు. ఆ చిన్నారిని లాక్కొని కారులోకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ కారును అడ్డుకునేందుకు తాత, నానమ్మతో పాటు కొందరు స్థానికులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆ వ్యక్తులు కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు ప్రభుత్వ స్కూల్లో టీచర్ అయిన బాలిక తండ్రి తన కుమార్తె కిడ్నాప్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్యతో వైవాహిక వివాదం వల్ల కుమార్తె కస్టడీపై కోర్టులో విచారణ కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. అయినప్పటికీ తన భార్య ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించాడు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయాలని పోలీసులను ఆయన కోరారు. అయితే ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన బాలిక కిడ్నాప్ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking CCTV from Kurali, Mohali (May 19): 4.5-year-old girl taken in broad daylight in front of her grandparents by people in a white car. Family custody dispute from mother’s side. Police investigating.” pic.twitter.com/6rihEnK06U
— Ghar Ke Kalesh (@gharkekalesh) May 20, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CCTV
- Fight Back
- Girl
- grandparents
RELATED ARTICLES
తాజా వార్తలు
Mimicry Artist Satyanarayana | ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ మృతి
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్‌రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

