Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
Chirumarthi Lingaiah | రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యావంతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు.
నకిరేకల్ (నల్గొండ ) : రాష్ట్రంలో నిరుద్యోగులకు ( unemployed ), విద్యావంతులకు ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య ( Chirumarthi Lingaiah ) పిలుపునిచ్చారు. నకిరేకల్, కేతపల్లి మండలాలలో పట్టభద్రుల ఎన్నికల ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించనున్న ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
పట్టభద్రులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి అని ప్రశ్నించారు . ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు పట్టభద్రులు సిద్ధంగా ఉండాలన్నారు. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపించారు. అర్హులైన ప్రతి నిరుద్యోగ యువతీయువకులకు ప్రతినెలా నిరుద్యోగ భృతి అందిస్తామన్న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
పట్టభద్రుల సమస్యలు కేవలం ఉద్యోగ భద్రతే కాకుండా, ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు , సంక్షేమ నిధుల కేటాయింపులపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు , పట్టభద్రులు ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే వేదికగా మలచుకోవాలని సూచించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

