Corona vaccine | క్యాన్సర్ రోగులు కరోనా వ్యాక్సిన్ వేసుకోవచ్చా.. సురక్షితమేనా?

కొండాపూర్, ఏప్రిల్ 26 : కరోనా రెండోదశ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైరస్ నియంత్రణకు తీసుకొచ్చిన వ్యాక్సిన్‌ను క్రమంగా అన్ని వయస్సుల వారికి వర్తింపజేస్తున్నది. మే 1 నుంచి అన్ని వయస్సుల వారికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పా ట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్ వేసుకుంటే అనారోగ్యానికి గురవుతామని, దీర్ఘకాలిక వ్యాధిగస్ర్తులకు సమస్యలు వస్తాయని రకరకాలు అనుమానాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ప్రధానంగా క్యాన్సర్ రోగుల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. అసలు క్యాన్సర్ రోగులు వ్యాక్సిన్ వేసుకోవచ్చా ? వేసుకున్న తర్వాత ఏమైనా దుష్ఫలితాలు వస్తాయా? తదితర వాటిని వివరించారు చీఫ్ ఆఫ్ రేడియేషన్ ఆంకాలజీ, మెడికవర్ వైద్యుడు డాక్టర్ వినోద్ మద్దిరెడ్డి.
క్యాన్సర్ రోగులకు వ్యాక్సిన్ సురక్షితమేనా?
- కొవిడ్ నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.
- కొవాగ్జిన్, కొవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పూత్నిక్ వీ, ఫైజర్, మెడెర్నా మొదలైనవి తీసుకోవచ్చు.
- క్యాన్సర్ రోగులు నిరభ్యంతరంగా కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చు.
- వ్యాక్సిన్ ఏదైనా సురక్షితమే.
ఎంఆర్ఎన్ ఏ వ్యాక్సిన్ అంటే ?
- స్పైక్ ప్రోటీన్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్‌ను జెనిటిక్ ఇంజినీరింగ్ విధానాన్ని ఉపయోగించి సింథసైసిస్ చేయబడుతుంది.
- తర్వాత శుద్ధమైన రూపంగా మారిన కొవిడ్-19 స్పైక్ ప్రోటీన్‌ని వ్యాక్సిన్‌గా తయారు చేస్తారు.
- ఎంఆర్ఎన్ఏని ఇంజెక్ట్ చేయడంతో ఇమ్యూన్డ్ సెల్స్ ఎంఆర్ఎన్ఏని తీసుకుని, స్పైక్ ప్రోటీన్ సీక్రెట్ కోడ్‌ని సింథసైజ్ చేస్తాయి.
- అది వెంటనే ఫారిన్ ప్రోటీన్‌ని గుర్తించి కొవిడ్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు మెషీనరీని ట్రెయిన్ చేస్తుంది.
- ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితం. ఫైజర్, మోడెర్నలు ఈ కోవకు చెందిన వ్యాక్సిన్లే.
వెక్టార్ వ్యాక్సిన్ అంటే ఏమిటి ?
- వెక్టార్ వ్యాక్సిన్ కూడా జెనెటిక్ ఇంజినీరింగ్ ఉపయోగించి తయారు చేసినదే.
- ఇది ఎలాంటి హాని చేయదు.
- పైగా మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వైరస్లు స్పైక్ ప్రోటీన్‌ను ఉత్పత్తి చేసేలా తయారు చేస్తారు.
- ఈ వెక్టార్ వ్యాక్సిన్లు జన్యుపరంగా మార్పు చేసిన వైరస్(బతికున్న). తర్వాత ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ లాగే ఇమ్యూనిటీని పెంచుతుంది.
- కొవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు ఈ వెక్టార్ కోవకు చెందినవే.
కిమోథెరపీ, రేడియేషన్, సర్జరీ పేషెంట్లు వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోవాలి ?
- కిమోథెరపీ, రేడియేషన్ తీసుకుంటున్న వారు ఎప్పుడైనా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.
- క్యాన్సర్ సర్జరీ రోగులు మాత్రమే వ్యాక్సిన్ వేసుకునేందుకు సమయం చూసుకోవాలి.
- సర్జరీకి ముందు లేదా తర్వాత 7 నుంచి 14 రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.
- అలా చేస్తేనే పోస్టు ఆపరేషన్ ఇన్ఫెక్షన్లు లేదా కాంప్లికేషన్లను, వ్యాక్సిన్ తర్వాత జ్వరం వంటి లక్షణాల మధ్య ఎలాంటి ఇబ్బందులు ఉండవు.
- అయితే బోన్‌మ్యారో (ఎముక మజ్జ) మార్పిడి జరిగిన వారుమాత్రం మూడునెలలు ఆగి వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.
క్యాన్సర్ రోగుల్లో వ్యాక్సిన్ ఎంతవరకు సత్ఫలితాలిస్తాయి ?
- క్లినికల్ ట్రయల్స్‌లో క్యాన్సర్ రోగులను చేర్చలేదు. అయినా సరే జనరల్ ట్రయల్స్ ద్వారా వచ్చిన ఫలితాలే వీళ్లకూ వర్తిస్తాయి.
- కొవాగ్జిన్, (డెడ్ వైరస్), లైవ్ వెక్టార్ వ్యాక్సిన్, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అన్ని సురక్షితమే.
- అయితే ఈ వ్యాక్సిన్ల ప్రభావం తెలియాలంటే టీకా తీసుకున్న క్యాన్సర్ పేషెంట్ల యాంటీబాడీలను గుర్తించాలి.
పీఈటీ సీటీ లేదా సీటీ లేదా మామోగ్రామ్కి ముందు వ్యాక్సిన్ తీసుకోవచ్చా
- ఏ వ్యాక్సిన్ అయినా శోషరస గ్రంథుల (లింప్ గ్లాండ్స్)ను విస్తరింపజేస్తాయి.
- దానివల్ల వ్యాధి తీవ్రత పెరిగే అవకాశాలుంటాయి.
- అందువల్ల ఎలాంటి ఇమేజింగ్ నైనా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.
- పీఈటీ సీటీ కృత్రిమంగా పెరిగిన వ్యాధిని చూపిస్తుంది.
- కాబట్టి వ్యాక్సిన్‌ను ఇమేజింగ్ తర్వాత తీసుకోవడం ఉత్తమం.
వ్యాక్సిన్‌తో రక్తం గడ్డ కడుతుందా ?
చాలాచాలా తక్కువ సందర్భాల్లోనే కాళ్లు, కడు పు, మెదడులో బ్లడ్ క్లాట్స్ కేసులు కనిపిస్తున్నాయి. రక్తం గడ్డ కట్టడం అనేది అపోహ మాత్రమే. అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
pulse oximeter : పల్స్ ఆక్సీమీటర్ ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా ఉపయోగించాలి?
వణికిస్తున్న ట్రిపుల్ మ్యుటెంట్.. ఎందుకంత డేంజర్? ఏం చేయాలి?
ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేవాళ్లు కోవిడ్ టీకా తీసుకోవచ్చా ?
వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండే వాళ్లు తినాల్సిన ఆహారపదార్థాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

