COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
COVID Diet : రోగ నిరోధక శక్తి పోషక విలువలతో కూడిన ఆహారం.. ఈ రెండూ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా వైరస్ బారిన


COVID Diet : రోగ నిరోధక శక్తి ( Immunity ), పోషక విలువలతో కూడిన ఆహారం.. ఈ రెండూ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక విధంగా కొవిడ్-19 ( COVID – 19 ) వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. సెకండ్ వేవ్ ( Second wave )లో అధిక శాతం పాజిటివ్ పేషెంట్లు హోమ్ క్వారంటైన్ ( Home Quarantine )లో ఉంటున్నా హాస్పిటల్స్లో చేరుతున్నవారి సంఖ్యకూడా అధికంగానే ఉంది. చాలామంది రెండువారాల్లో కోలుకుంటున్నారు. అయినా నీరసం, అలసటతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటివారు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నీళ్లు
శరీరానికి కావాల్సిన అతిముఖ్యమైన ద్రవం నీరు. చాలామంది రోజువారీ పనుల్లో పడి నీళ్లు తాగాలన్న విషయాన్నే మర్చిపోతారు. కానీ, నీళ్లు చాలినంతగా తాగకపోతే కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చు. జీర్ణక్రియలో, శోషణలో, పోషక విలువలను ఉపయోగించుకోవడంలో శరీరానికి నీరే ఆధారం.

తాజాపండ్లు
ఉదయం పండ్లముక్కలు లేదా పండ్లరసాలు తీసుకుంటే నీరసం తగ్గుతుంది. అలాగే, తాజా కూరగాయలను మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో తీసుకుంటే శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. వీటిలో ఉండే ప్రొటీన్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచి, త్వరగా కోలుకునేలా చేస్తాయి. అవసరమైతే డాక్టర్ని సంప్రదించి రోగ నిరోధక శక్తిని పెంచే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచే వ్యాయామం చేయాలి.
హెల్దీ డైట్ ప్లాన్

ఉదయం : నిద్ర లేవగానే నానబెట్టిన ఐదు బాదం గింజలు, కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకోవాలి. అరగంట తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ తాగాలి.
అల్పాహారం: ఒక పండు + నాలుగు ఇడ్లీలు/ రెండు దోశలు/ఒక కప్పు అటుకుల ఉప్మా/ ఒక కప్పు చిరుధాన్యాల ఉప్మా + ఒక కప్పు సాంబారు + కొత్తిమీర, పుదీనా చట్నీ.

మిడ్ మార్నింగ్: ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు లేదా నారింజ/నిమ్మ రసం.
మధ్యాహ్నం: ఒక కప్పు వెజ్ సలాడ్ + రెండు కప్పుల బ్రౌన్ రైస్ + ఒక కప్పు పప్పు + ఒక కప్పు వెజ్ కర్రీ + ఒక కప్పు పెరుగుతో భోజనం.
సాయంత్రం: ఒక కప్పు మొలకలు.
రాత్రి: ఒక పండు + రెండు పుల్కాలు + ఒక కప్పు పప్పు (లేదా) మొలకలు + కూరగాయల సలాడ్ + ఓట్స్/అటుకుల ఉప్మా.
నిద్రపోయే ముందు: ఒక గ్లాసు మజ్జిగ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

