Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Coronavirus Doubts | కరోనావైరస్పై ఇప్పటికీ చాలామందిలో చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి తోడు సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

Coronavirus Doubts : కరోనావైరస్పై ఇప్పటికీ చాలామందిలో చాలా సందేహాలు ఉన్నాయి. దీనికి తోడు కరోనా వైరస్ వ్యాప్తి, నివారణపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. దీంతో జనాలకు ఏది నిజమో, ఏది అబద్దమో తెలియక సందేహంలో పడిపోతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందన్న దానిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటేషన్ (సీడీసీ), ఇతర ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందా?
ఒక వ్యక్తి నుంచి వెలువడే తుంపిర్ల ద్వారానే వైరస్ ప్రధానంగా విస్తరిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ స్పష్టం చేశారు. తుంపిర్ల ద్వారా గాలిలో కలిసిన వైరస్ మూడు గంటల పాటు ఉంటుందన్నారు. ఈ సమయంలో గాలి వాటం ఎటు ఉంటే అటువైపు కొంత దూరం వరకు వైరస్ విస్తరిస్తుందని తెలిపారు. తలుపులు మూసిన నాలుగు గోడల మధ్య వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?
కరోనా వైరస్ నీటిలో పడితే దాని శక్తి పూర్తిగా పోతుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ స్పష్టం చేశారు. కాబట్టి నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయం అవసరం లేదని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి నుంచి వెలువడే తుంపిర్ల ద్వారానే వైరస్ ప్రధానంగా విస్తరిస్తుందని పేర్కొన్నారు.

తాగునీటితో కరోనా వస్తుందా?
తాగునీటిలోనూ కరోనా రెండు రోజుల పాటు బతికి ఉంటుందని సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. 4 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద చల్లటి నీటిలో వైరస్‌కు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉంటుందన్నారు. నీటిలోని వైరస్ ఒక్కటే ఇన్ఫెక్షన్ కలిగించలేదు. అది శరీరంలోకి వెళ్లాలంటే వందల కణాలు కావాల్సి ఉంటుందని తెలిపారు. అయితే తాగిన నీరు నేరుగా పొట్టలోకి వెళ్తుంది కాబట్టి ప్రమాదమేమీ లేదన్నారు. తాగునీటితో కొవిడ్ 19 వ్యాప్తి చెందిన కేసులు మనదేశంలో ఎక్కడా నమోదు కాలేదు కాబట్టి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ముందు జాగ్రత్తగా వేడి చేసిన నీటిని, వేడి వేడి ఆహార పదార్థాలనే తీసుకోవడం మంచిదని సూచించారు.

కరోనా వైరస్ ఎప్పుడు అంతమవుతుంది?
కరోనా వైరస్ ఎప్పటికి అంతమవుతుందనేది అప్పుడే చెప్పలేమని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. అందరూ టీకాలు వేయించుకోవడం, జాగ్రత్తలు పాటించడం ద్వారా రెండు నెలల్లో దాని ప్రభావాన్ని మాత్రం తగ్గించగలుగుతామని చెప్పారు. క్లినికల్‌గా చెప్పాలంటే మొదటి వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ఉద్ధృతిలో పెద్ద మార్పులేమీ లేవన్నారు. అవే లక్షణాలు, మరణాల రేటు కూడా అదేవిధంగా ఉందని చెప్పారు.

చెరువులు, కాల్వల్లో ఈత కొడితే కరోనా వస్తుందా?
నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్న దానికి ఎలాంటి ఆధారాలు లేవని సెంటర్స్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటేషన్ (సీడీసీ) తెలిపింది. కాబట్టి చెరువులు, కాల్వల్లో ఈత కొట్టే సమయంలో నీటి ద్వారా కరోనా వైరస్ సంక్రమించదు. కేవలం వైరస్ ఉన్న వ్యక్తికి సన్నిహితంగా ఉన్నప్పుడు మాత్రమే వైరస్ సోకే అవకాశం ఉంది.

దోమలు, ఈగల ద్వారా వైరస్ సంక్రమిస్తుందా?
దోమలు, ఈగల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. కేవలం వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపిర్ల ద్వారా ఇతరుల శరీరాల్లోకి వైరస్ వెళుతుంది.
– నవీన్ కుమార్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

