coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
coronavirus instructions | కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం.

coronavirus instructions : ఇప్పుడు కరోనా అందర్నీ వణికిస్తుంది ! కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఇప్పటికే దాదాపు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంత అవసరమో.. కరోనా బారిన పడినప్పుడు, వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవడం అంతే ముఖ్యం. కొవిడ్-19 సోకినప్పుడు శారీరకంగానే కాకుండా మానసికంగానూ దాని ప్రభావం ఉంటుంది. కరోనా వైరస్ నుంచి తొందరగానే కోలుకున్నా.. ఆ భయం తాలుకూ ఎఫెక్ట్ నుంచి మానసికంగా కోలుకోవాలంటే చాలా రోజులే పడుతుంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న తర్వాత శారీరకంగానే కాకుండా మానసికంగానూ దృఢంగా ఉండటం చాలా అవసరం. ఇందుకోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా ఉండే భయాలు
- కరోనా బారిన పడినప్పుడు చాలా భయాలు మనల్ని చుట్టేస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా చాలామంది ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడిపోతుంటారు.
- కరోనా సోకినప్పుడు ఎవర్నీ కలవలేం. ఎవరితో సరిగ్గా మాట్లాడలేం. దీనివల్ల ఒంటరితనంగా అనిపిస్తుంటుంది.
- కరోనా నుంచి కోలుకున్న తర్వాత బయట తిరగాలన్నా కొంతమందిలో తెలియని బిడియం ఉంటుంది. ఏదో తప్పు చేశామన్న భావనతో ఇతరులతో అంత త్వరగా కలవలేకపోతారు.
- గందరగోళంగా అనిపిస్తుంటుంది. ఇరిటేషన్, కోపం కూడా వస్తుంటాయి.
- నిరాశ, డిప్రెషన్, నిద్రలేమి తనం కూడా బాధిస్తాయి.
ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలి

- ప్రతిసారి కరోనాకు సంబంధించిన వార్తలను చూడటం వల్ల భయంగా అనిపిస్తుంటుంది. కాబట్టి కరోనాకు సంబంధించిన వార్తలను చూడటం తగ్గించాలి.
- తరచూ స్నేహితులు, సన్నిహితులతో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్‌తో టచ్‌లో ఉండాలి.
- ఇంటి దగ్గరే ఉండి కూడా పాత అలవాట్లను కొనసాగించాలి.
- తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
- ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.
- సౌకర్యాన్ని బట్టి వ్యాయామం చేస్తూ ఉండాలి.
- ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్న దాచుకోకుండా చెప్పుకోవాలి.
- కరోనా నుంచి కోలుకున్నవారికి సంబంధించిన పాజిటివ్ స్టోరీలు షేర్ చేసుకుంటూ ఉండాలి.
ఆహారపు అలవాట్లు
ఈ సమయంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. వైరస్ నుంచి కోలుకోవడానికి, కోలుకున్న తర్వాత కూడా ఇమ్యూనిటీని కాపాడుకోవడం ముఖ్యం. దీనికోసం ఆహారపు అలవాట్లను కచ్చితంగా పాటించాలి.

శక్తినిచ్చే ఆహారం తినాలి
కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇందుకోసం అన్నం, గోధుమలు, మొక్కజొన్న వంటి తృణధాన్యాలతో పాటు నూనెలు, చక్కెరలను ఆహారంగా తీసుకోవాలి.

ప్రోటీన్ ఆహారం
పప్పులు, గుడ్లు, చికెన్, చేపలు, మాంసం, పాలు, పాల ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందుతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి కణాలు పెరుగుతాయి.

ఇమ్యూనిటీ పెంచే ఆహారం..
రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్లు, ఖనిజాలు కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ సీతో పాటు జింక్, కాపర్, ఐరన్ సెలినియం వంటి ఖనిజాలు ఇమ్యూనిటీని పెంచుతాయి. వీటికోసం సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు సిట్రస్ లభించే పండ్లు, కూరగాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవాలి.

ఇమ్యూనిటీ బూస్టర్లు
- హెర్బల్ టీ తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి, ఎండు ద్రాక్షలు, బెల్లంతో చేసిన హెర్బల్ టీని రోజులో ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాలి.
- గ్లాసు వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని రోజులో ఒకటి లేదా రెండు సార్లు తాగాలి.
- డీ హైడ్రేట్ అవ్వకుండా ఉండేందుకు తగినన్ని నీళ్లు తాగాలి.
ఆరోగ్య చిట్కాలు

- ఎప్పుడూ భోజనం మానేయద్దు. శరీరానికి సరిపడ కేలరీలు అందేలా రోజుకు కనీసం 5 నుంచి 6 సార్లు భోజనం చేయాలి.
- తృణధాన్యాలు, పప్పులు, గోధుమలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- ఆకుకూరలు, పండ్లును ప్రతిరోజు ఆహారంగా తీసుకోవాలి.
- యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే బాదం, వాల్నట్స్, అవిసె గింజలు ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
- ఎప్పుడూ ఒకే నూనె వాడకూడదు. ఆలివ్, కనోలా, రైస్‌బ్రాన్, సోయా, మస్టర్డ్ ఆయిల్స్‌ను తరచూ మారుస్తూ ఉండాలి.

- ప్రతిరోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
- ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్‌ను మితంగా తీసుకోవాలి.
- వీలైనంత వరకు బయట ఆహారాన్ని తగ్గించాలి.
- ఆల్కహాల్, స్మోకింగ్, టొబాకోకు మానేయాలి.
- హైపర్‌టెన్షన్, డయాబెటిస్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు లేని వాళ్లు రోజులో కనీసం రెండు వేల కేలరీలు అందేలా చూసుకోవాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- corona
- Coronavirus
- Covid-19
- Health
RELATED ARTICLES
తాజా వార్తలు
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

