COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
COVID-19 Lung Damage | కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. వైరస్ ముక్కు లేదా నోటి నుంచి గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి

COVID-19 Lung Damage : కరోనా వైరస్ ప్రధానంగా శ్వాస వ్యవస్థపై దాడి చేస్తుంది. వైరస్ ముక్కు లేదా నోటి నుంచి గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి, అక్కడున్న వాయు కుహరాలను, కండరాలను ఇబ్బంది పెడుతుంది. దీంతో దగ్గు, దమ్ము, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. కొందరిలో న్యుమోనియాకు దారితీస్తున్నది. ఆస్తమా, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక రోగుల్లో సమస్య మరింత తీవ్రం అవుతున్నది. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే వైరస్ ముప్పు కాస్త తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. శ్వాస వ్యవస్థలోకి వైరస్ ప్రవేశించిన వెంటనే మన రోగ నిరోధకశక్తి దానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభిస్తుందని అంటున్నారు. దీంతో గొంతులో మంట, దురద, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. వీటిని ముందుగానే గుర్తించగలిగితే వైరస్ ఊపిరితిత్తులను దెబ్బతీయకముందే కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోండి
పెద్దవాళ్లు కనీసం 30 నిమిషాలు, యువత, పిల్లలు కనీసం 60 నిమిషాలపాటు వ్యాయామం చేయాలి. దీంతో శ్వాస తీసుకునే రేటు పెరిగి ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు శుభ్రం అవుతాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి.
రక్తంలో హిమోగ్లోబిన్, ఎర్రరక్తకణాల స్థాయిలను పరీక్షించుకోవాలి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును ప్రతిబింబిస్తాయి.
పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు తినాలి. దీంతో శరీరంలోని విషపదార్థాలు నిర్వీర్యం అవుతాయి. అరటిపండ్లు, ఆపిల్, ద్రాక్ష, టమాటాలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

Lung Damage గుర్తించడమెలా?
- గొంతు పొడిబారడం, గొంతునొప్పి
- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులుంటే లంగ్స్కు ఇన్ఫెక్షన్ సోకుతున్నదని అర్థం చేసుకోవాలి.
- ఊపిరితిత్తుల దిగువ భాగంలో (చివరి పక్కటెముకల వద్ద) వాపు రావడం లేదా తీవ్రమైన నొప్పి వస్తే వెంటనే డాక్టర్ను కలువాలి.
- వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరగానే వాయు కోశాలు (అల్వియోలి) దానికి వ్యతిరేకంగా ద్రవరూప పదార్థాన్ని విడుదల చేస్తాయి. దీంతో శ్వాస తీసుకున్నప్పుడు, పక్కటెముకల కింద నొప్పి కలుగుతుంది.
- పొడిదగ్గు ఉండటం, దగ్గుతున్నప్పుడు ఛాతిలో నొప్పి/మంట అనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
- కరోనా లక్షణాలతోపాటు ఊపిరితీసుకోవడం ఇబ్బందిగా మారితే అప్పటికే 25% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ విస్తరించిందని అర్థం. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Oxygen Levels : ఇవి తినండి.. ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోండి
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Children Health : కరోనా టైంలో మీ పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

