Children Health : కరోనా టైంలో మీ పిల్లలు మానసికంగా కుంగిపోకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Children Mental Health : కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విజృంభిస్తోంది. ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తుంది.

Children Mental Health : కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా విజృంభిస్తోంది. ఇప్పుడు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఇందుకోసం సామాజిక దూరం పాటిస్తూ వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. కానీ అలా ఇంటిపట్టున ఉండటం వల్ల ఇప్పుడు కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా పిల్లల మానసిక ఆరోగ్యం ( Children Mental Health )పై కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. స్కూళ్లు బంద్ కావడంతో పిల్లలు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం కానీ, ముచ్చట్లు పెట్టడం కానీ చేయలేకపోతున్నారు. దీనివల్ల వారు మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్లను మానసికంగా దృఢంగా ఉంచడం చాలా అవసరం. దీనికోసం వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారి సందేహాలను తీర్చడం.. వాళ్లతో సరదాగా గడపాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

పిల్లలు చెప్పేది వినాలి
ఇంట్లోనే ఉండాలి.. బయటకు వెళ్లొద్దని కట్టుబాట్లు పెట్టడం వల్ల పిల్లల్లో ఏదో తెలియని భయం మొదలవుతుంది. కాబట్టి వాళ్లలో ఉన్న భయాలను పోగొట్టడం చాలా అవసరం. ఇందుకోసం పిల్లలు ఏం చెప్పిన జాగ్రత్తగా వినాలి. వాళ్లలో ఉన్న భయాలను పోగొట్టడమే కాకుండా ఏం కాదన్న భరోసా ఇవ్వాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లలో నిర్లక్ష్యం చేస్తున్నామన్న భావన అసలు రానివ్వద్దు. కాబట్టి పిల్లల కోసం కొంచెం సమయం కేటాయించాలి. వాళ్లకు కథలు చెప్పాలి. ఇంట్లోనే ఆటలు ఆడించాలి. వాళ్లతో సరదాగా గడపాలి.

ఫ్రెండ్స్‌తో మాట్లాడనివ్వాలి
కరోనా టైంలో సామాజిక దూరం పాటించడం, వీలైనంతవరకు ఇండ్లలోనే ఉండటం అవసరమే. కానీ ఈ వయసులో పిల్లలను ఒంటరిగా ఉంచడం కూడా అంత మంచిది కాదు. దీనివల్ల మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలను వాళ్ల ఫ్రెండ్స్‌తో మాట్లాడుకునేందుకు అవకాశం కల్పించాలి. వాళ్ల ఫ్రెండ్స్, రిలేటీవ్స్తో వీడియో కాల్స్ మాట్లాడించాలి. స్నేహితులతో వర్చువల్ గేమ్స్ ఆడించాలి.

ఆందోళనలో ఉంటున్నారేమో గమనించాలి
ఇప్పుడు ఉన్న పరిస్థితులు పిల్లలకే కాదు తల్లిదండ్రులకూ కొత్తే. కానీ ఈ సమయంలో పిల్లలు ఏది అడిగినా చిరాకు పడకుండా ఓపిగ్గా సమాధానమివ్వాలి. వారి మనసులో ఏముందో తెలుసుకుని ఆ భయాలను పోగొట్టాలి. కొవిడ్-19 గురించి ఏది అడిగిన సాధ్యమైనంతవరకు వారికి అవగాహన కల్పించాలి. అంతేతప్ప వాళ్లు అడిగిన ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేయవద్దు.

అన్నీ చెప్పాలి
టీవీల్లో చూడటం వల్లనో.. మీరు ఫోన్లో మాట్లాడినప్పుడు వినడం వల్లనో గానీ పిల్లలకు కరోనా గురించి కొంత తెలుస్తుంది. దానిపై టన్నుల కొద్దీ ప్రశ్నలు వాళ్ల మెదడులో తిరుగుతుంటాయి. కాబట్టి వారికి కరోనాపై పూర్తి అవగాహన కల్పించాలి. ఈ సమయంలో ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు అన్న వాటిపై పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి.

ఆటలతో పాటు ఇతర పనులు అలవాటు చేయాలి
ఎదుగుతున్న వయసులో ఇంట్లోనే ఆటలు ఆడుకుంటూ పిల్లలు ఎక్కువ సమయాన్ని గడపలేరు. వారికి ఈజీగా బోర్ కొట్టేస్తుంది. కాబట్టి ఇన్‌డోర్‌లోనే కొత్తగా ఏం చేయవచ్చో నేర్పించాలి. గార్డెనింగ్, కుకింగ్‌పై వారికి ఆసక్తి కలిగేలా చేయాలి.

చదువూ ముఖ్యమే
కరోనా కారణంగా స్కూళ్ల మూతపడటంతో ఆన్లైన్లోనే ఇప్పుడు క్లాసులు చెబుతున్నారు. ఈ ఆన్లైన్ చదువులు పిల్లలకు అలవాటు లేనివే. అయినప్పటికీ వాళ్ల చదువులపై అశ్రద్ధ చేయొద్దు. ఆన్లైన్ క్లాసుల్లో చెప్పింది విని వాళ్లు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారో కూడా తెలుసుక వ వింటున్నారో లేదో తెలుసుకోవాలి. చదువు కోసం నిర్ణీత సమయం కేటాయించి.. ఆ టైంలోనే వాళ్లకు అసైన్మెంట్లు ఇస్తూ ఉండాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
Corona effect : భారత్ నుంచి ప్రయాణాలపై ఆస్ట్రేలియా ఆంక్షలు
దేశంలో అందుబాటులోకి మరో టీకా.. జైడస్ క్యాడిలా టీకాకు డీసీజీఐ అనుమతి
మే మూడో వారంలో కరోనా మరింత ఉద్ధృతం: ఎస్బీఐ రిపోర్ట్
గుజరాత్ లో దారుణం : కొవిడ్ బెడ్ కోసం రూ 9000కు బేరం
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

