Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Covid-19 deaths : కరోనావైరస్తోనే మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? నిమ్స్ నెఫ్రాలజీ విభాగం వైద్యుడు శ్రీభూషణ్‌రాజు సమాధానం ఇది

Covid-19 deaths : కరోనా ఇప్పుడు దేశాన్ని వణికిస్తుంది ! ఒకరిని ఒకరు పలకరించుకోవాలన్నా భయపడే పరిస్థితిని తీసుకొచ్చింది ! అంతెందుకు ఆప్తులు మరణించినా కూడా చివరిచూపు చూసేందుకు వెళ్లడానికి వెనుకాముందు కావాల్సి వస్తుంది. మరి ఇలాంటి సమయంలో మరి కరోనావైరస్తోనే మరణించిన వారి దహన సంస్కారాలకు వెళ్లొచ్చా? కరోనా మృతుల నుంచి వైరస్ వ్యాపిస్తుందా? అన్న సందేహం చాలామందిలోనే ఉంది. దానికి నిమ్స్ నెఫ్రాలజీ విభాగం వైద్యుడు డాక్టర్ శ్రీభూషణ్‌రాజు చెప్పిన సమాధానం ఇది..

“చనిపోయిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. కాబట్టి అంత్యక్రియలకు వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదు. దహన సంస్కారాలకు వెళ్లిన సమయంలో అందరూ గుంపులుగా చేరడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది. అంతేతప్ప చనిపోయిన వ్యక్తుల ద్వారా వైరస్ వ్యాప్తి జరగదు.” అని శ్రీభూషణ్ రావు వెల్లడించారు.
ఒక వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వచ్చే తుంపిర్ల ద్వారా SARS CoV-2 వ్యాప్తి చెందుతుంది. అయితే మృతదేహాల్లోనూ సలైవా, కఫం వంటి ద్రవాలు ఉంటాయి. అయితే మృతదేహాన్ని పట్టుకొని లేదా మీద పడి ఏడ్చినప్పుడు అవి మనకు అంటి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందుకోసమే కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించినప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరినీ అనుమతించడం లేదు. అని గతంలో ఒక ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోల్‌కతాకు చెందిన పరమాణు జీవశాస్త్రవేత్త అన్బిరన్ మిత్రా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

