కరోనా సెకండ్ వేవ్ ( Coronavirus Secondwave ) స్పీడ్ పెంచేసింది ! ఊహించిన దానికంటే వేగంగా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్క్ తప్పనిసరిగా వాడాలి. అది కూడా ఒక్కటి సరిపోదు.. కచ్చితంగా రెండు మాస్కులు ( Double Mask ) పెట్టుకోవాల్సిందేనని ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ, అటు వైద్యులు సూచిస్తున్నారు. రెండు మాస్కులు పెట్టుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ( సీడీసీ ) కూడా అప్పట్లోనే తెలిపింది. అయితే ఇప్పుడు ఈ రెండు మాస్కుల ( Double Mask )ను ఎలా వాడాలి? ఏది ముందు ధరించాలి? అనే దానిపై ఇప్పుడు చాలామందిలో సందేహాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోరు లేదా ముక్కు నుంచి తుంపిర్లు గాలి ద్వారా వచ్చి ఎదుటివారిపై పడుతుంటాయి. ఈ తుంపిర్ల ద్వారా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. మాట్లాడినప్పుడు లేదా దగ్గినప్పుడు వైరస్ 6 అడుగుల దూరం వరకు వ్యాప్తి చెందుతుంది. అదే తుమ్మినప్పుడు 18 అడుగుల దూరం వరకు వైరస్ వ్యాప్తి చెందుతుంది.
బహిరంగ ప్రదేశాల కంటే కూడా తలుపులు మూసి ఉంచిన పెద్ద గదుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మూసి ఉంచిన గదిలో కరోనా వైరస్ గాలిలో మూడు గంటల పాటు ఉంటుంది. ఒక వ్యక్తి తుమ్మినప్పుడు, లేదా దగ్గినప్పుడు తుంపిర్ల ద్వారా బయటకొచ్చిన వైరస్‌లో దాదాపు సగం తొలి గంటలోనే కిందపడిపోతుంది. మిగిలిన సగం వైరస్ నేలను చేరడానికి ఇంకో రెండు గంటల సమయం పడుతుంది. కాబట్టి ఒకే గదిలో ఎక్కువ మంది గుమిగూడితే వేగంగా ఒకరి నుంచి మరొకరి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉంటుంది.
మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. వైరస్ లోడ్‌ను మాస్కులు అడ్డుకుంటాయి కాబట్టి వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తక్కువ లోడ్ మాత్రమే వెళ్తుంది. శరీరంపై వైరస్ తీవ్రత కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అందరూ కచ్చితంగా మాస్కులు వాడాలి. జనాలు గుమిగూడి ఉన్న ప్రదేశాల్లో రెండు మాస్కులు వాడితే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక్క మాస్క్ వాడితే వైరస్ వ్యాప్తి రేటు 60 శాతం మాత్రమే తగ్గుతుంది. అదే రెండు మాస్కులు వాడితే వైరస్ వ్యాప్తిని 80 శాతానికి పైగా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్నవారు రెండు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అదే ఎన్-95 మాస్కులతో 95 శాతం రక్షణ లభిస్తుంది. కాబట్టి ఎన్ 95 మాస్క్ అయితే ఒక్కటి వాడినా సరిపోతుంది.
రెస్పిరేటరీ వాల్వ్ లేని ఎన్ 95 మాస్కులను మాత్రమే వాడాలి. రెస్పిరేటరీ వాల్వ్‌లు వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అదే మనం వదిలిన గాలిని మాత్రం నేరుగా బయటకు పంపిచేస్తుంది. ఒకవేళ కరోనా సోకిన వారు రెస్పిరేటరీ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులు ధరిస్తే వారు వదిలిన గాలి నేరుగా బయటకు వచ్చేస్తుంది. దీంతో ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
ఏ మాస్కులతో రక్షణ ఎక్కువ | |
---|---|
మాస్కు రకం | వ్యాప్తి అడ్డుకునే రేటు |
ఎన్-95 | 95 శాతం |
సర్జికల్ మాస్క్ | 56 శాతం |
బట్ట మాస్క్ | 49 శాతం |
కర్చీఫ్ | 33 శాతం |
ఎన్-95 మాస్కుల ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని వాడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు రెండు మాస్కుల విధానాన్ని ఫాలో అవడమే బెటర్. అలా అని రెండు సర్జికల్ మాస్కులు లేదా రెండు బట్ట మాస్కులనే వాడకూడదు.
ఒకేరకమైన రెండు మాస్కులు ధరించడం వల్ల పొరలు పెరుగుతాయే తప్ప ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. మాస్కు పొరలు పెరిగినప్పటికీ వాటి మధ్య ఉండే ఖాళీలు అలాగే ఉంటాయి. ఆ ఖాళీల నుంచి ముక్కు, నోటి ద్వారా వైరస్ శరీరం లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అదే రెండు విభిన్న రకాల మాస్కులు వాడితే మాస్కు పొరల్లో ఉండే ఖాళీలను పూడ్చినట్టుగా ఉండటమే కాకుండా.. రెండింటి ఆకృతి వేరేలా ఉంటుంది కాబట్టి ముఖానికి బిగుతుగా పట్టేసినట్టు ఉండి వైరస్ వ్యాప్తిని నియంత్రించగలుగుతాయి.
ముందుగా సర్జికల్ మాస్క్ ధరించి, దాని పై నుంచి బట్ట మాస్క్ పెట్టుకోవాలి. దీనివల్ల 85.4 శాతం వరకూ రక్షణ లభిస్తుంది. గాలి పీల్చుకోవడంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు.
రెండు మాస్కులు లేనప్పుడు ఒక సర్జికల్ మాస్క్‌ను ధరించవచ్చు. అయితే మాస్కులకు రెండు పక్కల ఉన్న రబ్బర్ మొదటి భాగాన్ని ముడివేసి ఎలాంటి గ్యాప్ లేకుండా చేయాలి. రెండు వైపులా అలా ముడివేయడం వల్ల ముక్కు, నోటిని కప్పేసినట్టుగా మాస్క్ ఉంటుంది. దీనివల్ల 77 శాతం వరకు రక్షణ లభిస్తుంది. ముడి వేయకుండా వాడితే 56 శాతం మాత్రమే రక్షణ లభిస్తుంది.
మాస్క్ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తిరగకూడదు. మాస్క్ ఉన్నా ఆరడుగుల దూరం పాటించడం తప్పనిసరి. ఇద్దరికీ మాస్కులు ఉన్నాయి కదా అని ముఖంలో ముఖం పెట్టి మాట్లాడటం మంచిది కాదు. అంత దగ్గర నుంచి మాట్లాడితే 5 మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న తుంపిర్లు నేరుగా ముక్కు, నోరు ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!