Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
Air purifier plants | ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్ ( Oxygen ) దొరికేలా చూసుకుంటున్నారు.

Air purifier plants | సాధారణంగా పట్టణాల్లో వాతావరణ కాలుష్యం ఎక్కువే. దీంతో స్వచ్ఛమైన గాలి దొరకడం కష్టమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది నగరవాసులు తాము నివసిస్తున్న పరిసరాల్లో ఎక్కువ ఆక్సిజన్ ( Oxygen ) దొరికేలా చూసుకుంటున్నారు. ఇందుకోసం ఎక్కువగా ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేందుకు ఇష్టపడుతున్నారు. ఇండ్లమీద, బాల్కనీ, గోడలపై ఈ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. సెకండ్ వేవ్ ( Second wave ) లో కరోనా ( Corona ) విజృంభించి ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు ఊపిరి ఆడక విలవిలలాడుతున్నారు. ఇలా కొవిడ్ ( COVID-19) నేర్పిన పాఠంతో ఎయిర్ ప్యూరిఫై మొక్కల ( air purifier plants ) పెంపకంపై నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. కొనుగోలు చేసేందుకు నర్సరీల వైపు పరుగులు పెడుతున్నారు. మరోవైపు వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా నర్సరీ నిర్వాహకులు సైతం అనేక మొక్కలను సిద్ధం చేస్తున్నారు. రూ.50 నుంచి రూ.500ల వరకు అమ్ముతున్నారు.

ఆక్సిజన్ ( Oxygen ) ఎక్కువగా అందించే మొక్కలు..
సాధారణంగా మొక్కలన్నీ గాలిలోని కార్బన్ డైయాక్సైడ్‌ను పీల్చుకొని తిరిగి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటాయి. అలాంటప్పుడు కొత్తగా ఆక్సిజన్ మొక్కలంటే ఏమిటనే సందేహం రావచ్చు.కానీ అన్ని మొక్కలు ఒకేస్థాయి, ఒకే విధంగా శ్వాసక్రియను జరపవు. అదేవిధంగా ఆక్సిజన్‌ను విడుదల చేయవు. కొన్ని మొక్కలు పగటి పూట ఆక్సిజన్, రాత్రిపూట కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేస్తుంటాయి. అదీగాక అవి విడుదల చేసే ఆక్సిజన్ పరిమాణం చాలా తక్కువ. కానీ కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. మరికొన్ని పగలు, రాత్రి అన్న తేడా లేకుండా 24 గంటల పాటు ఆక్సిజన్‌నే ఉత్పత్తి చేస్తూ.. పరిసరాల్లోని గాలిని శుద్ధి చేస్తాయి. వీటినే పర్యావరణ ప్రేమికులు, బయాలజిస్టులు ఆక్సిజన్ మొక్కలుగా పిలుస్తుంటారు. వాటిలో కొన్ని మీ కోసం..

వీపింగ్ ఫిగ్ ( weeping fig )
ఇది ఫైకస్ రకానికి చెందిన మొక్క. నాసా గుర్తించిన ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్క. ఇంటి పరిసరాల్లో ఉన్న ఫార్మాల్డిహైడ్, జైలిన్, టౌలిన్ తదితర కాలుష్యకారక వాయువులను సైతం పీల్చుకుంటుంది.

మనీప్లాంట్ ( Money Plant )
దీనిని సాధారణంగా పోథోస్ ప్లాంట్ అని కూడా అలంకరణ మొక్కగా కూడా ప్రసిద్ధి పొందింది. దీనిని ప్రత్యేకత ఏమిటంటే 24 గంటల పాటు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఫార్మాల్డిహైడ్, బెంజిన్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది.

స్పైడర్ ప్లాంట్ ( Spider Plant )
ఇండోర్ ప్లాంట్‌గా ఎక్కువగా ప్రసిద్ధి. ఇంట్లోని గాలిని అధిక శాతం శుద్ధి చేస్తుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ మొత్తంలో విడుదల చేస్తుంది. ఈ మొక్క మరో ప్రత్యేకత ఏమిటంటే తీవ్ర ఒత్తిడిని సైతం పోగొడుతుంది.

అరెకా ఫామ్ ( Areca palm )
ఈ మొక్క ప్రత్యేకతలెన్నో. చక్కటి ఇండోర్ ప్లాంట్. కార్బన్ డైయాక్సైడ్‌నే గాకుండా గాలిలోని కాలుష్యకారక వాయువులన్నింటినీ ఇది పీల్చుకుంటుంది. గాలిని శుద్ధి చేస్తుంది. ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ ( Oxygen )ను విడుదల చేస్తుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేసేలా ప్రోత్సహిస్తుంది.

జెర్బారా డైసీ Gerbera Daisy
ఇవి అలంకరణ మొక్కలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ మొక్కల పుష్పాలను వేడుకల్లో అలంకరణ కోసం వినియోగిస్తుంటారు. అంతే కాదు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను విడుదల చేయడం వీటి ప్రత్యేకత. కార్బన్‌తో పాటు ఇతర ప్రమాదకర కాలుష్యకార వాయువులను సైతం ఇది పీల్చుకుని పరిసరాలను శుద్ధి చేస్తుంది.

స్నేక్ ప్లాంట్ Snake Plant
నాసా గుర్తించిన మరో ఎయిర్ ప్యూరిఫైయింగ్ మొక్క ఇది. అంతేగాక ఎక్కువ మంది ప్రేమించే మొక్క. ఇంట్లోని గాలిని ఎక్కువగా శుద్ధి చేస్తుంది. కార్బన్‌తో పాటు, ఫార్మాల్డిహైడ్, బెంజిన్, జైలిన్ వాయువులనే కాదు.. ట్రై క్లోరో ఇథలిన్, నైట్రోజన్ తదితర అధిక కాలుష్యకారక వాయువులను సైతం ఇది పీల్చుకుంటుంది. ఆక్సిజన్‌ను ఎక్కువ శాతం విడుదల చేస్తుంది.

తులసి ( Tulsi )
భారతీయతకు తులసి మొక్కకు ఉన్న సంబంధం ప్రాచీనమైనది. అదీగాక అనేక ఆయుర్వేద ఔషధగుణాలున్న మొక్క ఇది. అందుకే దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్‌గా పిలుస్తుంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పరిసరాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. రోజులో కనీసం 20 గంటల పాటు ఇది ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంటుంది. అదేవిధంగా కార్బన్ డై యాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై యాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులను సైతం ఇది పీల్చుకుని ప్రాణవాయువును అందిస్తుంది.
గతంతో పోల్చితే డిమాండ్ పెరిగింది
ఏడాది కాలంగా ఆక్సిజన్ మొక్కలకు డిమాండ్ పెరిగింది. కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం 50 శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. ఎయిర్ ప్యూరిఫైయర్లుగా కాకుండానే ఇంటి అలంకరణకు ఈ మొక్కలు ఎంతో ప్రసిద్ధి. అదీగాక వీటి సంరక్షణ ఎంతో సులువు. -కె.శ్రీను, తులసీ నర్సరీ, హుమాయున్‌నగర్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

