Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Sonia Gandhi | దేశంలో 1975లో ఎమర్జెన్సీ (Emergency) విధించిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం ఓ పొరపాటేనని అన్నారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) కూడా అప్పట్లో తనది పొరపాటు నిర్ణయం అని భావించి ఉండవచ్చని చెప్పారు.
Sonia Gandhi : దేశంలో 1975లో ఎమర్జెన్సీ (Emergency) విధించిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం ఓ పొరపాటేనని అన్నారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) కూడా అప్పట్లో తనది పొరపాటు నిర్ణయం అని భావించి ఉండవచ్చని చెప్పారు. తన ఆత్మకథ త్వరలో పుస్తక రూపంలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ బ్రిటిష్ దినపత్రిక (British Daily) కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాడు సంజయ్ గాంధీని నిలువరించి ఉంటే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన నష్టంలో చాలావరకు నివారించగలిగేవారని అభిప్రాయపడ్డారు. ‘ఎమర్జెన్సీ విధించడం పొరపాటే. ఇందిర కూడా అదేవిధంగా భావించి ఉంటారు. ఎమర్జెన్సీ నిర్ణయంపై కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిని రాజీవ్‌గాంధీ కూడా వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాలని తన తల్లికి చెప్పినప్పటికీ.. ఆమె చిన్న కుమారుడు సంజయ్ మాత్రం ఎమర్జెన్సీకి పట్టుబట్టారు. ప్రతిపక్షం తన తల్లిని నాశనం చేస్తుందని, వారిని కట్టడి చేయాలని ఓ రోజు ఫ్యామిలీ డిన్నర్లో వాదించారు.
రాజీవ్ తన తల్లిని నిలదీయడానికి ప్రయత్నించగా ఆమె వినడానికి నిరాకరించారు. ఈ విషయం కుటుంబంలో కూడా ఉద్రిక్తతలను పెంచింది. సంజయ్‌ని అదుపులో పెట్టి ఉంటే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన నష్టంలో చాలావరకు నివారించి ఉండేవారు. వాస్తవానికి ఇందిరా ఓ ప్రజాస్వామ్యవాది అని భావిస్తా. ఇలా చెప్తే చాలా మంది నవ్వుతారని తెలుసు. కానీ నాటి ఎమర్జెన్సీ సమయంలో ఆమె ఏమాత్రం సౌకర్యంగా లేరని చెప్పగలను. ఆ భారం ఆమెపై చాలా ఎక్కువగా ఉండేదని అనుకుంటున్నా’ అని సోనియా గాంధీ తెలిపారు.
ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ సోనియా గాంధీ ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. కేవలం సంజయ్ నుంచే కాకుండా సీనియర్ల నుంచి కూడా ఇందిరాగాంధీపై ఒత్తిడి ఉండేదన్నారు. ఆమె చుట్టూ ఉండే వాళ్లలో రాజీవ్ మాదిరిగా భిన్నంగా ఆలోచించేవారు తక్కువగా ఉండేవారని చెప్పారు. క్రమంగా ఆమె స్వయంగా పరిస్థితిని అర్థం చేసుకొని వాటిని చక్కదిద్దినట్లు వివరించారు. ఎమర్జెన్సీ విధించిన తర్వాతే అసలేం జరుగుతుందో తనకు అర్థమైందని, ప్రజాస్వామ్య హక్కులు కట్టడి చేయడం, హెబియస్ కార్పస్ నిలిపివేయడం వంటివి జరిగాయన్నారు. కానీ అదంతా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని చివరగా సోనియాగాంధీ స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

