Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Iran | బాలిస్టిక్ క్షిపణుల (Ballistic missiles) పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. దాంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను అభివృద్ధి చేసేదిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Iran : బాలిస్టిక్ క్షిపణుల (Ballistic missiles) పరిధిపై విధించుకున్న 2,000 కిలోమీటర్ల స్వీయ పరిమితిని ఎత్తివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) ప్రకటించింది. దాంతో మరింత దూరంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను అభివృద్ధి చేసేదిశగా ఇరాన్ అడుగులు వేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ (Israel), అమెరికా (USA) ల దాడులకు హద్దుల్లేని ప్రతిదాడులు చేద్దామని ఇరాన్ సేనలకు సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) పిలుపునిచ్చారు.
ఈ క్రమంలోనే ఇరాన్ తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. క్షిపణుల పరిధికి సంబంధించిన పరిమితులు తొలగిపోయాయని, ఈ సామర్థ్యాలను తాము ఆచరణలో ప్రదర్శిస్తామని జనరల్ హొస్సేన్ మొహెబ్బి మీడియా సమావేశంలో వెల్లడించారు. కాగా, 2,000 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లగల బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నట్లు అధికారిక సమాచారమేమీ లేదు. ఈ రెండు వేల కిలోమీటర్ల పరిధి కింద మొత్తం అరేబియా ద్వీపకల్పంతోపాటు ఈజిప్టులోని చాలావరకు భూభాగం, గ్రీస్, బాల్కన్‌లోని కొన్ని ప్రాంతాలు వస్తాయి.
అయితే ఇరాన్ తన అంతరిక్ష కార్యక్రమానికి సంబంధించిన సాంకేతికతను ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల రూపకల్పనకు ఉపయోగించుకునే అవకాశాలు లేకపోలేదని అమెరికా చెబుతున్నది. యెమెన్ రాజధాని సనా సమీపంలోని అల్-షరియా ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో 22 మంది మృతి చెందారని హౌతీ తిరుగుబాటుదారుల ఆధ్వర్యంలోని ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 30 మంది గాయపడ్డారని తెలిపింది. వారిలో చాలావరకు మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నది.
సౌదీ అరేబియానే ఈ దాడులకు పాల్పడిందని ఆరోపించింది. దక్షిణ యెమెన్‌లోని ఓ మార్కెట్‌పై జరిగిన దాడుల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారని హౌతీలు ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు జరిగాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
Farmer | ‘రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బ్రోకర్ ముచ్చట్లే.. తెల్లారి లేస్తే మాకు కేసీఆరే గుర్తొస్తరు’
Annamayya Song | ఇంటర్నేషనల్ స్టేజ్‌పై మార్మోగిన అన్నమయ్య కీర్తన.. ‘బ్రహ్మమొక్కటే’ పాటకు గూస్బంప్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

