కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా ? మరణించిన వ్యక్తి శరీరంలో వైరస్ ఎంతసేపు బతికి ఉంటుంది?
కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా ? లేదా? అని జనాలు భయపడుతున్న ఈ సమయంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా కీలక విషయాన్ని వెల్లడించారు.

ఈ కరోనా పుణ్యమా అని అయినవాళ్లు కూడా కానివాళ్లు అయిపోతున్నరు ! ఎంతటి ఆత్మీయులు దూరమైనా సరే చివరిచూపు కోసం వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటున్నరు ! వైరస్తో సచ్చిపోతే కనీసం పాడె మోసేందుకు కూడా నలుగురు ముందుకు రాలేని దుస్థితి వచ్చింది !! కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా ? లేదా? అని జనాలు భయపడుతున్న ఈ సమయంలో ఎయిమ్స్ ఫొరెన్సిక్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా కీలక విషయాన్ని వెల్లడించారు. మరణించిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12 నుంచి 24 గంటలకు మించి కరోనా వైరస్ బతకలేదని స్పష్టం చేశారు. నిరభ్యంతరంగా అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని తెలిపారు.

కరోనాతో మరణించిన వారి 100కు పైగా మృతదేహాలను పరీక్షించాం. వైరస్ బారిన పడి మరణించిన ఒక్కో వ్యక్తి మృతదేహానికి 12, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు కరోనా పరీక్షలు నిర్వహించాం. అప్పుడు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. కాబట్టి ఒక వ్యక్తి మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల తర్వాత ఆ వ్యక్తి మృతదేహం నుంచి కరోనా వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువ. కాకపోతే మృతదేహం ముక్కు రంధ్రాలు, నోరు, మూసేయడం, బతికి ఉన్నప్పుడు రోగికి అమర్చిన వివిధ పైపులను తీసి శానిటైజ్ చేయడం మంచిది. అని డాక్టర్ సుధీర్ గుప్తా తెలిపారు.
కరోనా మృతుల అస్థికలు సేకరించొచ్చా?

కరోనాతో చనిపోయిన వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. కాకపోతే ముందు జాగ్రత్తగా మాస్కులు, గ్లౌసులు, పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొనడం మంచిది. దహన సంస్కారాల అనంతరం ఎముకలు, చితాభస్మం కూడా నిరభ్యంతరంగా సేకరించవచ్చు. అస్థికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమే లేదు. అది పూర్తిగా సురక్షితం అని డాక్టర్ సుధీర్ గుప్తా పేర్కొన్నారు. కరోనాతో మరణించిన వ్యక్తులకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు జరిపించాలన్న ఉద్దేశ్యంతోనే ఈ అధ్యయనం చేసినట్లు స్పష్టం చేశారు.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

