Post Corona symptoms : కరోనా తగ్గాక జుట్టు రాలుతుందా? ఇలా ట్రై చేయండి
Post Corona symptoms :కొవిడ్ ( COVID-19 ) నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ( Hair fall ) ఒకటి.

Post Corona symptoms :కొవిడ్ ( COVID-19 ) నుంచి కోలుకున్నాక చాలామందిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి. వాటిలో జుట్టు రాలడం ( Hair fall ) ఒకటి. మానసిక ఒత్తిడివల్ల కూడా జుట్టు రాలుతుందన్నది తెలిసిందే. ఈ వైరస్ మనిషిని మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతున్నదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒత్తిడిని తగ్గించుకుని సమతుల ఆహారం తీసుకుంటే జుట్టు సమస్యనుంచి త్వరగా బయటపడొచ్చు.

బాదం-వాల్నట్స్
రోజూ ఏడు బాదం గింజలు, రెండు వాల్నట్స్ తీసుకోవాలి. బాదం గింజల్లో పుష్కలంగా ఉండే మెగ్నీషియం కేశాల పెరుగుదలకు తోడ్పడటంతోపాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది. వాల్‌నట్స్‌లోని పొటాషియం కొత్త కణాల ఉత్పత్తికి సాయపడుతుంది.

చియా, గుమ్మడి, అవిసె గింజలు
ఈ మూడు గింజలనూ ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి. చియా గింజల్లోని ఫాస్పరస్ జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. గుమ్మడి గింజల్లో పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అవిసె గింజల్లో ‘విటమిన్-ఇ’ అపారం. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి.

కొబ్బరినూనె
ఒక టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన కొబ్బరినూనెను పరగడుపున తీసుకోవాలి. ఇది వెంట్రుకల మొదళ్లను దృఢంగా మార్చి, జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

గుడ్లు
వీటిలో ప్రొటీన్ పుష్కలం. రోజూ మూడు గుడ్ల తెల్లసొన, ఒక గుడ్డు పచ్చసొన ఆహారంలో చేర్చుకోవాలి. తెల్ల సొన మాడును శుభ్ర పరుస్తుంది. పచ్చ సొనలోని విటమిన్స్, మినరల్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Double Mask అవసరమా? సర్జికల్, క్లాత్ మాస్కుల్లో ఏది పైనుంచి పెట్టుకోవాలి?
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Coronavirus Doubts : నీటి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? ఈత కొడితే కొవిడ్-19 వస్తుందా?
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్‌ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్‌లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

