మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Nov 12, 2020 , 01:21:42

పట్టణాభివృద్ధే లక్ష్యం

పట్టణాభివృద్ధే లక్ష్యం

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ 

ప్రహరీ నిర్మాణానికి భూమిపూజ

సిరిసిల్ల టౌన్‌: పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌  జిందం కళ పేర్కొన్నారు. మున్సిపల్‌ వాటర్‌ ట్యాంకుల పరిరక్షణలో భాగంగా 14వ ఆర్థిక సంఘం నిధులు 10లక్షలతో తారకరామారావునగర్‌లో ట్యాంకు ప్రహరీ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. పట్టణంలోని పద్మనగర్‌, సాయినగర్‌లో వాటర్‌ ట్యాంకుల వద్ద ఇప్పటికే ప్రహరీల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ వేముల రవి, కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు.