బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్
నీరా టాండన్| అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో ఇండియన్ అమెరికన్ నియమితులయ్యారు. వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నిరా టాండన్‌ను బైడెన్ నియమించారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మరో ఇండియన్ అమెరికన్ నియమితులయ్యారు. వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్‌ను బైడెన్ నియమించారు. గతంలో ఆమెను వైట్‌హౌస్‌లో బడ్జెట్ చీఫ్‌గా నియామించాలనుకున్నప్పుడు రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను సీనియర్ సలహదారుగా బైడెన్ నియమించారు. దీనికి సెనెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆమె హెల్త్‌కేర్, ఇంటర్నెట్ యాక్సెస్ అంశాలపై ఆమె దృష్టిసారించనున్నారు.
సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) అధ్యక్షురాలిగా పనిచేస్తున్న టాండన్.. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా వ్యవహరించారు. కాగా, అగ్రరాజ్యంలో బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండన్ నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన అధ్యక్షుడు బైడెన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌కు ఇది తొలి కేబినెట్ వైఫల్యంగా నిలిచింది.
భారత మూలాలున్న నీరా టాండన్‌ను వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నియమించాలని బైడెన్ నిర్ణయించారు. అయితే, నీరా గతంలో డెమొక్రాటిక్ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అవి వివాదాస్పదమమవడంతో ఆమె నియామకాన్ని మంత్రులు, డెమొక్రాటిక్ చట్టసభ్యులు వ్యతిరేకించారు. దీంతో ఆమె నియామకాన్ని ధ్రువీకరించేందుకు సెనెట్‌లో సరిపడా ఓట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో నీరా తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ముంచుకొస్తున్న తుఫాను
మాస్కుల నుంచి విముక్తి
అలుపెరుగని అంగన్వాడీలు
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
కరోనా.. గందరగోళం
పిల్లలు జాగ్రత్త!
గ్రామాల్లో వేగంగా వైరస్: మోదీ
పరీక్షల రద్దు వార్తలు నమ్మొద్దు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

