హైదరాబాద్: ప్రభుత్వరంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచీల్లో క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీని చేపట్టింది. ఇందులో కస్టమర్ సపోర్ట్, సేల్స్ విభాగంలో జూనియర్ అసోసియేట్ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5121 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో హైదరాబాద్ రీజియన్లో 275 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులకు స్థానిక భాష తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
అర్హత: డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 20 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మూడు విభాగాలుగా ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మొత్తం 100 మార్కులను ప్రశ్నలు ఇస్తారు. అన్ని ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షను గంట వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
రెండో దశ.. మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఆజ్జెక్టివి విధానంలో ఉంటాయి. పరీక్షను 2.40 గంటల్లో పూర్తిచేయాలి.
వీటిలో అర్హత సాధించినవారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
ప్రిలిమినరీ రాతపరీక్ష: జూన్ నెలలో
మెయిన్ పరీక్ష: జూలై 31
వెబ్సైట్: https://www.sbi.co.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి