Man justifies littering station | రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని సమర్థించుకున్న వ్యక్తి.. వీడియో వైరల్
Man justifies littering station | రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ముంబై: రైల్వే స్టేషన్లో చెత్త వేయడాన్ని ఒక వ్యక్తి సమర్థించుకున్నాడు. శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని అన్నాడు. (Man justifies littering station) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి ముంబైలోని లోకల్ ట్రైన్లో ప్రయాణించాడు. గుట్కా తిన్న తర్వాత రేపర్‌ను రైలు కోచ్ విండో నుంచి స్టేషన్లోకి విసిరాడు. ఎదురుగా ఉన్న మరో ప్రయాణికుడు దీనిని గమనించి అతడ్ని నిలదీశాడు. అయితే తన చర్యను ఆ వ్యక్తి సమర్థించుకున్నాడు. రైల్వే స్టేషన్ శుభ్రత కోసం రైల్వేకు తాను మెయింటెనెన్స్ చెల్లిస్తున్నానని చెప్పాడు. దీంతో ‘మీకు అవార్డు ఇవ్వాలి’ అని ఎదురుగా ఉన్న వ్యక్తి అన్నాడు. ‘అవును నాకు అవార్డు ఇవ్వండి’ అని ఆ వ్యక్తి సమాధానమిచ్చాడు.
కాగా, ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ‘మానసికంగా సరిగా లేని ఈ జంటిల్‌మ్యాన్ శుభ్రత కోసం రైల్వేకు మెయింటెనెన్స్ చెల్లిస్తున్నాడట. అందుకే స్టేషన్‌ను చెత్తమయం చేస్తాడట. ఇలా అయితే శుభ్రత మెరుగవుతుందా? ఇలాంటి ఇడియట్లను ఎలా డీల్ చేయాలి? ప్రయాణానికి అనుమతించకూడదు’ అని అందులో పేర్కొన్నాడు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి బుద్ధి చెప్పాలని కొందరు, కఠిన చర్యలు తీసుకోవాలని మరికొందరు డిమాండ్ చేశారు. రైల్వే కూడా ఈ వీడియో క్లిప్‌పై స్పందించింది. ఆ వ్యక్తి తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
Sick mentality
This Gentleman gives maintenance to the @RailMinIndia to clean it and he will keep on doing filth and will not improve.
How to deal with such idiots. They don't deserve to travel.@Central_Railway @RailwaySeva @mumbairailusers @IndianRailUsers @swachhbharat pic.twitter.com/5YSvdJaWPQ
— PRITHVirakshak 🇮🇳 (@dharmeshbarai) April 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

