కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
కేరళలో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ | అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రతరంకావడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తిరువనంతపురం : అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రతరంకావడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్‌గోడ్‌తో సహా ఉత్తర జిల్లాలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షాపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్‌ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. కోజికోడ్ జిల్లాలోని వడకర గ్రామంలో వంద కుటుంబాలకు 310 మందితో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో కాసరగోడ్‌లో అలలు ఎగిపడుతున్నాయి. చెరంగై తీరానికి సమీపంలో ఇండ్లు మునిగిపోయాయి.

రాష్ట్రంలో కొవిడ్ -19 ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తౌక్టే తుఫాను ఈ నెల 17-18 మధ్య తీరం దాటుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ 53 బృందాలను అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ కేరళ, తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో నీటి మట్టం ప్రమాదం, భారీ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు మణిమల, కేరళలోని అచన్‌కోవిల్, తమిళనాడులోని కొడయార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఈ మూడు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి..
Good News : 2డీజీ డ్రగ్ వచ్చే వారం అందుబాటులోకి
బెర్హంపూర్ సర్కిల్ జైలులో 48 మంది ఖైదీలకు కరోనా
భారత్‌కు సాయం ప్రకటించిన న్యూయార్క్ సిటీ
మృతుల గౌరవాన్ని కాపాడేలా చట్టం తేవాలి : ఎన్హెచ్ఆర్సీ
నాగాలాండ్, అసోంలో భూకంపం
టీకాల్లో ‘ఇండియా ఫస్ట్’ విధానం ఏమైంది : కాంగ్రెస్ నేత
ఈ నెల 17న రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో కేంద్రమంత్రి భేటీ
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- CWC
- Cyclone Tauktae
- Heavy Rains
- IMD
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

