Sharwanand | శర్వానంద్ 35వ సినిమాగా ‘మనమే’
శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత.
శర్వానంద్ 35వ సినిమా ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని బుధవారం మేకర్స్ విడుదల చేశారు. భిన్న మనస్తత్వాలు కలిగిన ఇద్దరు వ్యక్తుల ప్రయాణంలో తారసపడ్డ ఊహించని అతిథి కథ ఇదని టీజర్ ద్వారా చెప్పారు. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడే ప్లేబాయ్‌గా ఇందులో శర్వా నటిస్తున్నాడని మేకర్స్ చెబుతున్నారు.
కృతి శెట్టిది బాధ్యత గల అమ్మాయి పాత్ర అట. పిల్లాడు విక్రమ్ ఆదిత్య ఎంట్రీతో వీరిద్దరి జీవితం తలకిందులవుతుందనీ, మూడు పాత్రల మధ్య ఉన్న బంధాలను బయటపెట్టకుండా స్మార్ట్‌గా టీజర్‌ని కట్ చేయడం జరిగిందనీ, టీజర్లో ముగ్గురు పాత్రదారులూ చాలా అందంగా కనిపిస్తున్నారనీ నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్, విష్ణుశర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణం: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

