టీఆర్టీఎఫ్ కట్టంగూరు మండల శాఖ నూతన ప్రధాన కార్యదర్శిగా పెండెం శ్రీనివాసులు
తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టి ఆర్ టి ఎఫ్) కట్టంగూర్ మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పెండెం శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), జడ్పీహెచ్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన మండల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.
రామగిరి, ఆగస్టు 10 : తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టి ఆర్ టి ఎఫ్) కట్టంగూర్ మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పెండెం శ్రీనివాసులు, స్కూల్ అసిస్టెంట్ (హిందీ), జడ్పీహెచ్ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన మండల సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కట్టంగూరు మండలంలో టి ఆర్ టి ఎఫ్ సంఘ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెండెం శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు. మండల శాఖ అధ్యక్షుడు చిట్టబోయిన లింగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేశ్ యాదవ్, రాష్ట్ర గౌరవ సలహాదారు ముప్పిడి మల్లయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

