Pooja Hegde | మంగళూరు సోయగం పూజాహెగ్డే సరికొత్త ప్రేమాయణం ఇప్పుడు బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. హిందీ సీరియల్ నటుడు, బిగ్‌బాస్ సీజన్ 10 ఫేమ్ రోహన్ మెహ్రతో ఈ అమ్మడు ప్రేమలో ఉందని ప్రచారం జరుగుతున్నది. గత కొంతకాలంగా పూజా హెగ్డే హాజరవుతున్న ప్రతి ప్రైవేట్ ఫంక్షన్స్‌లో రోహన్ మోహ్ర దర్శనమిస్తున్నాడు. ఇటీవల పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఓ రెస్టారెంట్‌కు వెళ్లగా అక్కడ కూడా రోహన్ మెహ్ర కనిపించారు.
పూజా ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీంతో ఈ భామ అతనితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వారిద్దరి బంధానికి కుటుంబ సభ్యుల ఆమోదం ఉందని అంటున్నారు. ఆ కారణంగానే పూజా హెగ్డే కుటుంబ సభ్యులతో కూడా రోహన్ మెహ్ర సన్నిహితంగా ఉంటున్నాడని చెబుతున్నారు. అయితే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే కానీ ఈ కొత్త ప్రేమకథలోని నిజానిజాలేమిటో తెలుస్తాయని అభిమానులు అనుకుంటున్నారు. గత రెండేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నది పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ హిందీలో ‘దేవా’ అనే చిత్రంలో నటిస్తున్నది.