Watch: పార్కులోని కారులో మరో వ్యక్తితో భార్య.. రగిలిపోయిన ఆమె భర్త ఏం చేశాడంటే?
Man hits wife in Park | పార్కులోని కారులో మరో వ్యక్తితో కలిసి భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అతడు బేస్‌బాల్ బ్యాట్‌తో ఆ కారు అద్దం ధ్వంసం చేశాడు. మోసగించిన భార్యను ఆ బ్యాట్‌తో చితకబాదాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చండీగఢ్: పార్కులోని కారులో మరో వ్యక్తితో కలిసి భార్య ఉండటాన్ని ఆమె భర్త చూశాడు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన అతడు బేస్‌బాల్ బ్యాట్‌తో ఆ కారు అద్దం ధ్వంసం చేశాడు. మోసగించిన భార్యను ఆ బ్యాట్‌తో చితకబాదాడు. (man hits wife in Park) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలోని పంచకులలో ఈ సంఘటన జరిగింది. పార్క్‌లో ఉన్న కారులోని ముందు సీటులో ఒక మహిళ, ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక వ్యక్తి ఆగ్రహంతో ఆ కారు వద్దకు వచ్చాడు. తన చేతిలో ఉన్న బేస్‌బాల్ బ్యాట్‌తో కారు డోర్ అద్దాన్ని పగులగొట్టాడు. మరో వ్యక్తితో కలిసి ఉన్న భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కారు నుంచి దిగిన ఆ మహిళను బేస్‌బాల్ బ్యాట్‌తో కొట్టాడు. ఆమె తనను మోసం చేసిందని ఆరోపించాడు.
కాగా, పార్కులోని కొందరు వ్యక్తులు జోక్యం చేసుకున్నారు. భార్యను కొడుతున్న ఆ వ్యక్తి బారి నుంచి ఆమెను విడిపించారు. అయితే ఆ మహిళతోపాటు కారులో ఉన్న వ్యక్తి ఆమెను కాపాడేందుకు ప్రయత్నించలేదు.
మరోవైపు బహిరంగంగా తనను కొట్టిన భర్తపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను కొట్టిన భర్తపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, పార్కులోని ఒక వ్యక్తి రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
पंचकूला में एक पति द्वारा पत्नी से मारपीट करने का मामला आया सामने।
पति द्वारा पत्नी को शक के आधार पर बेसबॉल से पीटने का वीडियो आया सामने।
पीड़ित महिला की शिकायत कर सेक्टर 25 चोंकि पुलिस ने मामला दर्ज कर आरोपी को पति को किया गिरफ्तार। pic.twitter.com/sHncFca5Zp
— Reporter Rajeev (@RajivRathi999) April 16, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- baseball bat
- Cheating
- haryana
- Hits
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

