ఆస్ట్రేలియాలో ఎలుకలపై ఎడతెగని మహాయుద్ధం

కాన్బెరా: ప్రపంచం కరోనాతో సతమతం అవుతుంటే ఆస్ట్రేలియా ఎలకలతో యుద్ధం చేస్తున్నది. న్యూసౌత్‌వేల్స్, క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రాల్లో ఎలుకలు పుట్లకొద్దిగా పుట్టుకువస్తున్నాయి. స్థానికులను ఎవరిని కదిలించినా యుద్ధంలో సేనానిలా మాట్లాడుతున్నారు. తెలివైన ఎత్తుగడలు, శత్రువును ముగ్గులోకి దించడం, బుడ్డ జంతువులను తుదముట్టించడం గురించి వివరిస్తున్నారు. కానీ 6 నెలలు గడిచినా సమస్య తగ్గుముఖం పట్టలేదు. శత్రువును ఓడించడం మాట దేవుడెరుగు ఇప్పుడు ఎలుకలు ఆ ప్రాంతాలను మబ్బుల్లా కమ్మేస్తున్నాయి. గాయం మానకపోగా నిరంతరం కెలుకుతున్నట్టుగా ఉంది. టన్నుల కొద్దీ పాయిజన్ ఉపయోగించినా మూషిక సంతానం అంతరించలేదు. స్థానికుల్లో ఒకరకమైన నిర్వేదం కనిపిస్తున్నది. మానసికంగా కృంగిపోతున్నారు. ఈ ఎలుకల బెడద అనేది అనుభవిస్తేగానీ తెలియదు. ఆ దుర్భరమైన వాసన.. కొరికేసిన ఫర్నిచర్, వైర్లు, స్విచ్ బోర్డులు, ఏసీల ఇన్సులేషన్లు.. ఇల్లూ, బళ్లూ అన్నీ కూడా ఎలుకల బారిన పడినవే. నిన్నటిదాకా పిల్లలు ఎలుకను చూడగానే చెంగున గెంతేవారు. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటి గురువారం న్యూసౌత్‌వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఎలుకల బెడద నివారణకు 5 కోట్ల డాలర్ల ప్యాకేజీ ప్రకటించింది. కొత్త ఎలుకల విషం కనుగొనడం, రైతులకు ఎలుకల విషం పాకెట్లు ఉచితంగా పంచడం, చిన్న వ్యాపారులకు, గృహస్థులకు ఎలుకల మందు రిబేట్లు ఇస్తున్నారు. కానీ సిడ్నీకి పశ్చిమంగా 500 కి.మీ. దూరంలో ఉండే తాలింబాలో నివసించే లూయిజ్ మెక్‌కేబ్ లాంటివారు సాయం చాలా ఆలస్యంగా అందినట్టేనని అంటున్నారు. ఎలుకల మందు ఇస్తున్నారు సరే.. ఇదివ రకే జరిగిన నష్టం ఎవరు పూరిస్తారని ఆమె అంటున్నారు. నాలుగు రోజులు ఊరికెళ్లి తిరిగొచ్చి తలుపు తీస్తే ఇంటినిండా వేల ఎలుకలు అటూఇటూ పరుగెత్తుతూ కనిపించాయి మరి. కొత్త తివాచీ చీలికలు పేలికలైపోయింది. కిందనున్న కలప గచ్చు కూడా రంద్రాలతో నిండిపోయింది. ఈ బెడద ఎప్పుడు ఆగిపోతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governor Shukla | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
Revolt brews in NC | ఎన్సీలో తిరుగుబాటు?.. 19 మంది ఎమ్మెల్యేల భేటీ, తీర్మానం
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

