e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

న్యూఢిల్లీ: బంగారం వంటే భార‌తీయ మ‌హిళ‌ల‌కు ఎంతో ప్రీతి.. అక్ష‌య తృతీయ.. ధంతేరాస్ వంటి ప‌ర్వ దినాల్లో ప్ర‌తి ఒక్క‌రూ బంగారం కొనుగోలు చేయ‌డానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఈ ఏడాది అక్ష‌య తృతీయ టైమ్‌లో బంగారం కొనుగోలు చేయాలా? క్రిప్టో క‌రెన్సీ కొనుగోలు చేయాలా? అన్న విష‌య‌మై ఇన్వెస్ట‌ర్లు గంద‌ర‌గోళానికి గుర‌య్యారు.

గ‌త కొన్ని నెల‌లుగా అంత‌ర్జాతీయ మార్కెట్‌లో క్రిప్టో క‌రెన్సీలు బిట్ కాయిన్‌, డోజ్ కాయిన్ దూకుడుగా దూసుకెళ్తున్నాయి. మిలియ‌నిల్స్ ద్రుష్టిని ఆకర్షిస్తున్నాయి. భార‌తీయ ఇన్వెస్ట‌ర్లు కూడా ఇందులో జ‌త క‌లిశారు. కాక‌పోతే క్రిప్టో క‌రెన్సీ విలువ మాత్రం అనిశ్చితికి గుర‌వుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర ప‌రిణామం.

బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!
Bitcoin gold coin. Cryptocurrency concept. Virtual currency background.

బంగారం మాత్రం ఒడిదొడుకుల‌కు గుర‌వుతున్న‌ది. బంగారం మాదిరిగానే స్టోర్‌-ఆఫ్‌-వాల్వు ఇన్వెస్ట్‌మెంట్ బిట్ కాయిన్ నిలిచింది. క‌రెన్సీ డీ వాల్యూయేష‌న్, అనిశ్చితికి వ్య‌తిరేకంగా పెట్టుబ‌డికి మార్గంగా బిట్ కాయిన్ నిలుస్తున్న‌ది కానీ అనిశ్చితికి గుర‌వుతున్న‌ద‌ని క్రిప్టో క‌రెన్సీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బంగారానికి ఉన్న డిమాండ్‌, దానిప‌ట్ల స‌మ్మోహ‌నం ఏమాత్రం త‌గ్గ‌వ‌ని ఐఐఎఫ్ఎల్ సెక్యూర‌టీస్ క‌మొడిటీస్ అండ్ క‌రెన్సీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా చెప్పారు. ఏడాది కాలంలో రెండంకెల రిట‌ర్న్స్ ల‌భించాయ‌న్నారు.

అమెరికా డాల‌ర్‌తో ఇటు బంగారం.. అటు బిట్ కాయిన్ ప‌ర‌స్ప‌ర విలోమ సంబంధం సంబంధం ఉంద‌ని అనూజ్ గుప్తా అంగీక‌రించారు. డాల‌ర్‌కు వ్య‌తిరేకంగా బిట్ కాయిన్‌, బంగారం త‌రుచుగా పైచేయి సాధిస్తూనే ఉన్నాయ‌న్నారు. బిట్ కాయిన్‌.. డిజిట‌ల్ గోల్డ్ అవ‌తారమెత్తింద‌ని కొంద‌రు ఇన్వెస్ట‌ర్లు పేర్లు కూడా పెట్టారు.

బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!
Bitcoin gold coin. Cryptocurrency concept. Virtual currency background.

మిలియ‌నిల్స్‌, టెక్నాల‌జీసిస్ట్‌లు మిన‌హా ప‌దేండ్ల క్రితం వెలుగులోకి వ‌చ్చిన క్రిప్టో క‌రెన్సీకి భ‌విష్య‌త్ లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఇండియ‌న్ ఇన్వెస్ట‌ర్ల విష‌యానికి వ‌స్తే ప‌సిడి మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఫ‌స్ట్ చాయిస్‌గా నిలుస్తుంద‌ని క్యాపిట‌ల్ వ‌యా గ్లోబ‌ల్ రీసెర్చ్ క‌మోడిటీస్ అండ్ క‌రెన్సీ అధినేత క్షితిజ్ పురోహిత్ వ్యాఖ్యానించారు.

భార‌తీయ ఇన్వెస్ట‌ర్లు సుదీర్ఘ‌కాలంగా జ్యువెల్ల‌రీస్‌, బంగారంపై పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్యం ఇచ్చార‌ని క్షితిజ్ పురోహిత్ చెప్పారు. బంగారంతో పోలిస్తే క్రిప్టో క‌రెన్సీల‌కు భార‌త దేశంలో విస్త్రుత స్థాయిలో ఆమోదం ల‌భించ‌లేద‌న్నారు. క్రిప్టో క‌రెన్సీల నిర్వ‌హ‌ణ, నిబంధ‌న‌ల ప‌ట్ల క్లారిటీ లోపించింద‌ని తెలిపారు.

బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

క్రిప్టో క‌రెన్సీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ బీటెక్స్ సీఈఓ మోనార్క్ మోదీ మాట్లాడుతూ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీలో పెట్టుబడులు పెట్ట‌డానికి ముందు ఒక‌టికి రెండుసార్లు త‌ప్ప‌నిస‌రిగా త‌నిఖీ చేసుకోవాల‌ని సూచించారు. సంబంధిత క్రిప్టో క‌రెన్సీ ల‌క్ష్యాన్ని సాధించే ముందు దాని విజ‌న్ త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్నారు.

గ‌త 50 ఏండ్ల‌లో బంగారం ధ‌ర‌లు స్ఫూర్తిదాయ‌క రీతిలో పెరిగాయి. దాంతో పోలిస్తే బిట్ కాయిన్ 2008లో మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌ గ‌త ద‌శాబ్ద కాలంలోనే 0.08 డాల‌ర్ల స్థాయి నుంచి ఇటీవ‌లే 60 వేల డాల‌ర్ల‌కు చేరుకున్న‌ది. క్రిప్టో క‌రెన్సీల్లో పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల మెరుగైన రిట‌ర్న్స్ ఉన్నా.. అనిశ్చితి వెంటాడుతున్న‌ద‌ని క్షితిజ్ పురోహిత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు

అనిల్‌కి షాక్‌ భారత్‌కు స్విస్‌ వివరాలు

28న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

కెయిర్న్‌ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?

ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు!

Amazon miniTV: అమెజాన్‌ మినీ టీవీ లాంచ్‌.. పూర్తిగా ఉచితం

మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది!

ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్ప‌త్తి ప్రారంభం

గుంటూర్‌ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త

లాక్‌డౌన్ ఉల్లంఘ‌నుల నుంచి రూ 28 ల‌క్ష‌ల జ‌రిమానా వ‌సూలు!

హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ

13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఒడిశాలో షూటింగ్‌ల‌పై నిషేధం..!

బ్రిట‌న్ వైపు ఇండియ‌న్ సంప‌న్నుల చూపు.. నిపుణులు కూడా..!

రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాలు

యూపీలో దారుణం: కొవిడ్‌-19 రోగి కుటుంబంపై కాల్పులు?!

Corona టైం..ప‌రిమ‌ళించిన మాన‌వ‌త్వం: అంబులెన్స్ డ్రైవ‌ర్‌గా ఎన్నారై

అక్ష‌య తృతీయకు డిమాండ్ లేకున్నా.. పెరిగిన బంగారం దిగుమ‌తులు

రఘురామకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలి : రమ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బంగారం vs క్రిప్టో క‌రెన్సీ.. పెట్టుబ‌డికి ఏది బెస్ట్‌? గోల్డ్‌కే ఇండియ‌న్ల మొగ్గు!!

ట్రెండింగ్‌

Advertisement