Ramalinga Reddy: డీకే శివకుమార్‌కు జలక్.. రాజీనామా చేసిన మంత్రి రామలింగా రెడ్డి
Minister Ramalinga Reddy : కర్నాటక మంత్రిగా రామలింగారెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కానీ శుక్రవారం తన పదవికి ఆయన రాజీనామా చేశారు. తనకు నచ్చిన మంత్రిత్వశాఖను అప్పగించలేదన్న నిరాశతో ఆయన రెండు రోజులకే మంత్రి పదవిని వదులుకున్నారు.
బెంగుళూరు: కర్నాటక సీఎం డీకే శివకుమార్‌కు జలక్ తగిలింది. ఆయన మంత్రివర్గంలో బుధవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి(Ramalinga Reddy).. రెండు రోజులకే తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. మంత్రిత్వశాఖ అప్పగింత విషయంలో నిరుత్సాహానికి గురైన రామలింగారెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. సీఎం శివకుమార్ కేటాయించిన శాఖను స్వీకరించేందుకు రామలింగారెడ్డి తిరస్కరించారు. బెంగుళూరు డెవలప్మెంట్ మంత్రిత్వశాఖను ఇస్తానని డీకే హామీ ఇచ్చారని, కానీ తనకు ఇరిగేషన్ శాఖను అప్పగించారని ఆయన ఆరోపించారు. నీటిపారుదల శాఖ తనకు ఇష్టం లేదన్నారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు డీకే శివకుమార్ తన ఇంటికి వచ్చారని, బెంగుళూరు పట్టణాభివృద్ధి శాఖను అప్పగిస్తానన్నారని, సీఎంను నేను ఏ పదవీ అడగలేదని, ఆయన స్వంతంగా ఆ ఆఫర్ చేశారని, రెండు సార్లు ఆయన వాగ్ధానం చేశారని, కానీ ఆ తర్వాత నీటిపారుదల శాఖను అప్పగించడం తనకు ఇష్టం లేదని రామలింగారెడ్డి తెలిపారు. అందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు తన లేఖలో తెలిపారు. ఒకవేళ ఇప్పుడు తనకు నచ్చిన పోస్టును డీకే శివకుమార్ ఇచ్చినా.. తాను ఆ మంత్రిత్వశాఖను తీసుకోబోను అని రామలింగారెడ్డి చెప్పారు. బెంగుళూరు పోర్టుఫోలియా ఇచ్చినా తీసుకోను అని, ఎమ్మెల్యేగానే చేస్తానని, కాంగ్రెస్‌తోనే ఉంటానన్నారు.
గురువారం రాత్రి సీఎం డీకే శివకుమార్ 13 మంది మంత్రులకు శాఖను కేటాయించారు. బెంగుళూరు డెవలప్మెంట్ శాఖ కోసం రామలింగారెడ్డి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. కానీ సీఎం డీకే శివకుమార్ ఆ శాఖను అప్పగించేందుకు ఆసక్తిగా లేరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

