Watch: కూలిన నాలుగంతస్తుల బిల్డింగ్.. తర్వాత ఏం జరిగిందంటే?
Building Collapses | నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. భయాందోళన చెందిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ పగుళ్లివ్వడంతో అందులోని నివాసితులను సకాలంలో ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.
న్యూఢిల్లీ: నాలుగు అంతస్తుల నివాస భవనం కూలిపోయింది. భయాందోళన చెందిన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఆ బిల్డింగ్ పగుళ్లివ్వడంతో అందులోని నివాసితులను సకాలంలో ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. (Building Collapses) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జూన్ 3న సాయంత్రం 6:38 గంటల సమయంలో ప్రకాష్ విహార్‌లోని నాలుగు అంతస్తుల నివాస భవనం ఉన్నట్టుండి కూలిపోయింది. దీంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, విపత్తు నివారణ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు.
కాగా, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన పౌర శాఖ ఆ భవనం సమీపంలో డ్రైనేజీ నిర్మాణం, మరమ్మతు పనులు చేపడుతున్నది. దీని కారణంగా ఆ రోజు మధ్యాహ్నం సమయంలో ఆ నివాసిత బిల్డింగ్‌లో పగుళ్లు కనిపించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు, స్థానికులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఆ భవనంలోని నివాసితులను ఖాళీ చేయించారు.
మరోవైపు కొన్ని గంటల్లోనే ఆ బిల్డింగ్ కూలిపోయింది. దీంతో స్థానిక నివాసితులు భయంతో పరుగులు తీశారు. అయితే నివాసితులను ముందుగానే ఖాళీ చేయించడంతో ప్రాణ నష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
After Malviya Nagar its from karawal nagsr where four-storey residential building collapsed triggering panic in the neighbourhood residents had evacuated structure after cracks began appearing earlier in the day preventing any casualties. #Delhi #KarawalNagar #BuildingCollapse pic.twitter.com/X2YybkUSv8
— Neharika Maheshwari🇮🇳 (@niharikam_21) June 4, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

