ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్పత్తి ప్రారంభం
మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్‌కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి.

న్యూఢిల్లీ : మరో రెండు రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమైంది. హర్యానా, ఉత్తరాఖండ్‌కు చెందిన 3 ప్లాంట్లు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ప్లాంట్లు లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి మూసివేసి ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీదారు హీరో మోటోకార్ప్ మే 17 నుంచి 3 ప్లాంట్లలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది. ప్రస్తుతం హర్యానా, ఉత్తరాఖండ్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హీరో మోటోకార్ప్ ఏప్రిల్ 22 నుండి మే 2 వరకు అన్ని ప్లాంట్లలో ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేసింది. మే 16 వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
హర్యానాలోని గురుగ్రామ్-ధారుహేరా, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం కానుందని హీరో మోటోకార్ప్ తెలిపింది. ప్రస్తుతం, మూడు ప్లాంట్లలో షిఫ్టులో పని జరుగుతుందని పేర్కొన్నది. ఇతర ప్లాంట్లలో ఉత్పత్తికి సంబంధించి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇతర ఉత్పాదక కర్మాగారాలు, సౌకర్యాలను క్రమంగా తెరువనున్నారు.
హర్యానా, ఉత్తరాఖండ్‌తో పాటు, హీరో మోటోకార్ప్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, రాజస్థాన్‌లోని నీమ్రానా, గుజరాత్‌లోని హలోల్లలో కూడా ప్లాంట్లు ఉన్నాయి. ఈ ప్లాంట్లన్నింటిలో 80 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. 45 ఏండ్ల వయసు పైబడిన ఉద్యోగులలో 90 శాతం కంటే ఎక్కువ మంది టీకాలు వేసినట్లు హీరో మోటోకార్ప్ ప్రకటించింది. అన్ని ప్లాంట్లలో కఠినమైన భద్రత, పరిశుభ్రత ప్రోటోకాల్‌లను అనుసరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
స్పైస్‌జెట్ నిర్వాకం.. రోజంతా పైలట్లకు జాగారం..
100 పడకల కొవిడ్ కేంద్రం ఏర్పాటులో నటి జాక్వెలిన్ బిజీ
టీకాలు తీసుకున్నా.. మాస్క్‌లు మరువొద్దు : డాక్టర్ రణదీప్ గులేరియా
ఆధునిక హంగులతో రాజధానిని నిర్మిస్తున్న ఈజిప్ట్
“మీ ప్రియమైన వారి చేయి వదలకండి”: టీనా అంబానీ సందేశం
తెరపైకొచ్చిన మిక్కీ మౌస్.. చరిత్రలో ఈరోజు
అక్కడ మసీదులు మాయమయ్యాయి.. ఎందుకంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
Platelet Count | పిల్లల్లో ప్లేట్లెట్స్ ఎందుకు తగ్గుతాయి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

